తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో ఏర్పాటు చేసిన భాజపా విజయ సంకల్ప సభలో సంజయ్ మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని వెల్లడిరచారు. ఫసల్ బీమా అమలు చేస్తాం.. ఇళ్లను నిర్మిస్తామని, జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని.. ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని మాటిచ్చారు.
అక్రమ అరెస్ట్
కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేను చెప్పింది ఒక్కటే.. మీరేం భయపడకండి, ఢల్లీి నుండి ఫోన్ వచ్చింది, పులి వస్తోంది, వేట మొదలైంది, అది కార్యకర్తల్ని కాపాడే పులి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. హిందీ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు తనను అర్థరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. 8 గంటల పాటు రోడ్ల మీదే తిప్పారని గుర్తు చేశారు. అయితే.. కరీంనగర్ దాటిన తర్వాత తన భార్య ఫోన్ చేసిందని, ఢల్లీి నుండి ఫోన్ చేశారని చెప్పిందని తెలిపారు. తనని కొత్తపేట, ప్రజ్ఞపూర్, భువనగిరికి తీసుకుపోయారని.. అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ‘ఎక్కడికి తీసుకుపోతున్నారో అర్థం కావడం లేదని’ భయపడుతూ చెప్పాడని అన్నారు. అప్పుడు తాను ‘మీరేం భయపడకండని, ఢల్లీి నుంచి ఫోన్ వచ్చిందని, అక్కడి నుంచి పులి వస్తోందని, ఆ పులి వెంటాడటం ప్రారంభించిందని, ఆ పులే కార్యకర్తల్ని కాపాడుతుందని’ భరోసా ఇచ్చాడని పేర్కొన్నారు.
బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా
తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే.. కేసీఆర్ సర్కార్ అడుగడుగునా అడ్డుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రాక్షస రాజ్యాన్ని, కుటుంబ పాలనను, నియంత పాలనను కూకటి వేళ్లతో పెకిలించివేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చామని ఉద్ఘాటించారు. అందరి ఆశీస్సులు కావాలని కోరిన ఆయన.. లాఠీదెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంతపెద్ద ఎత్తున సభకు తరలి వచ్చినందుకు అందరికీ చేతులెత్తి జోడిరచారు. కాగా.. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ, మధ్యప్రదేశ్ ఇంఛార్జీలు తరుణ్ చుగ్, మురళీధర్ రావు, సహఇంఛార్జీ అరవింద్ మీనన్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.