Chandrababu Amaravathi Tour : అవినీతి సొమ్ము కక్కిస్తాం - అమరావతిలో చంద్రబాబు !

0

 

ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలో సభ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ వైసీపీ పెండిరగ్‌లో పెట్టిందని వాటిని పూర్తిచేసే బాధ్యత తెదేపా తీసుకుంటుందని చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. తెదేపా అధికారంలోకి వస్తే పేదరిక నిర్మూలనతోపాటు అమరావతిని అభివృద్ధి చేసి ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్ది చదువుకున్నవారికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. వైకాపా నేతలు తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని, వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అవినీతి సొమ్మును కక్కిస్తామని హెచ్చరించారు. 

అన్నం తింటున్నారా? లేక ఇసుకను తింటున్నారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.2750 కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభిస్తే, వైకాపా నిధులు ఇవ్వకుండా మూలన పడేసిందని ఆరోపించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. కృష్ణానది సాక్షిగా ఎమ్మెల్యే శంకరరావు నదిలో అడ్డంగా రోడ్డు వేసి ఇసుక దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. శంకరరావుకు వంకర్రావు అనే పేరు సరిపోతుందని ఎద్దేవా చేశారు. పర్యావరణానికి నష్టం జరుగుతుందని ఎన్జీటీ చెప్పినా పట్టించుకోవడం లేదు. అన్నం తింటున్నారా? లేక ఇసుకను తింటున్నారా? అని ప్రశ్నించారు. నెలకు రూ.20 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కడుతున్నారంటే శంకరరావు ఎంత తింటున్నారో అర్థం చేసుకోవాలని చంద్రబాబు ధ్వజమెత్తారు.  రేషన్‌ బండి వెనుక మరో బండి పెట్టి బియ్యం సేకరించి అక్రమంగా తరలిస్తున్నారు. గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకువెళ్లాలని వైకుంఠపురం వద్ద బ్యారేజ్‌ కట్టాలని శంకుస్థాపన చేసి టెండర్లు కూడా పిలిచాం. ఆ ప్రాజెక్టు వచ్చి ఉంటే ఈ ప్రాంతం బాగుపడేది. ఆ పనులన్నీ నిలిపివేసారు. తెదేపా అధికారంలోకి రాగానే వైకుంఠపురం ప్రాజెక్టు వస్తుంది. ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మిస్తాం. ఇలాంటి వ్యక్తులకు ఓట్లు వేస్తే కట్టుబట్టలు కూడా ఉండవు. పది నెలలు పని చేయండి. మీ అందరి జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాం.. అని చంద్రబాబు ప్రసంగించారు.

జగన్‌ ఇంటికి పోవడం ఖాయం

ఇసుక, మట్టి విచ్చలవిడిగా దోచుకుంటూ దొంగే దొంగ అన్నట్లు ఎమ్మెల్యే శంకరరావు వ్యవహారం ఉందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ విమర్శించారు. సభలో శ్రీధర్‌ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజవర్గ ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే జగన్‌ ఇంటికి పోవడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను నమ్మక ద్రోహం చేశాడన్నారు. తెదేపా నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, నన్నపనేని రాజకుమారి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, వైవీ ఆంజనేయులు, నసీర్‌ అహ్మద్‌, కోవెలమూడి నాని, మన్నవ మోహనకృష్ణ, వెన్నా సాంబశివారెడ్డి, మల్లాది విష్ణు, జానీ, వసంతరావు పాల్గొన్నారు.

మా అభ్యర్థి ఎవరు సర్‌..?

చంద్రబాబు ప్రసంగ సమయంలో మా పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి ఎవరు సారూ.. అంటూ కార్యకర్తలు చంద్రబాబును ప్రశ్నించగా అభ్యర్థి సంగతి మీకేందుకు మీ హద్దుల్లో మీరు ఉండండి. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కేడర్‌ గందరగోళంలో పడిరది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, ఎన్‌ఆర్‌ఐ వట్టికుంట శేషగిరిరావు వర్గాల మధ్య పలు చోట్లు విభేదాలు చోటు చేసుకున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !