INTER BOARD NEW GUIDELINES : కొత్తదనం లేని ఇంటర్‌ బోర్డ్‌ మార్గదర్శకాలు !

0

గత ఫిబ్రవరిలో నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సమర్పించిన నివేదికపై సమీక్ష అనంతరం ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ కొత్త మార్గదర్శకాలను జారీచేశారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మొత్తం 16 రకాల మార్గదర్శకాలను జారీ చేశారు.

ఇంటర్‌ బోర్డు నూతన మార్గదర్శకాలు..

  • ఇంటర్‌ తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగాలి.
  • ఉదయం అల్పాహారం తీసుకోవడానికి, ఇతర కాలకృత్యాల కోసం గంటన్నర సమయం ఇవ్వాలి.
  • మధ్యాహ్నం, రాత్రి భోజనానికి 45 నిమిషాలు విరామం ఇవ్వాలి.
  • కనీసం 8 గంటల పాటు నిద్రపోయే అవకాశం విద్యార్థులకు ఇవ్వాలి.
  • ఏటా ప్రతి విద్యార్థికి యాజమాన్యాలు రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించాలి.
  • అదనంగా తరగతులు నిర్వహించాలనుకుంటే రోజుకు 3 గంటలకు మించరాదు.
  • రోజూ సాయంత్రం విద్యార్థులు వినోదాన్ని, ఉల్లాసాన్ని పొందేందుకు గంట సమయం కేటాయించాలి
  • తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలి. వారికి ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరిగా ఉండాలి.
  • ఒకసారి సిబ్బందిని నియమించుకుంటే విద్యాసంవత్సరం ముగిసే (ఏప్రిల్‌) వరకు వారిని తొలగించరాదు.
  • ప్రతి జూనియర్‌ కళాశాలకు శాశ్వతంగా ప్రత్యేక మొబైల్‌ నంబరు ఉండాలి.
  • ప్రతి కళాశాలలో సీనియర్‌ అధ్యాపకుడిని స్టూడెంట్‌ కౌన్సిలర్‌గా నియమించాలి.
  • ఇంటర్‌బోర్డు అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రతి జూనియర్‌ కళాశాల తప్పనిసరిగా పాటించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్‌ నిరోధానికి కమిటీని నియమించాలి.
  • కళాశాలలో చేరిన తర్వాత విద్యార్థి ఒకవేళ 3 నెలల్లోపు మానుకుంటే 75%, ఆ తర్వాత 3 నెలల్లోపు 50%, 6 నెలల అనంతరం అయితే 25% ఫీజు తిరిగి చెల్లించాలి. 

ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలేవి ?

ఇకనుంచి ఏదైనా కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత ఒక ఏడాది ఆ కళాశాలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేదిలేదని గత మార్చి 6న సమావేశానికి హాజరైన కళాశాలల ప్రతినిధులను అధికారులు హెచ్చరించారు. తాజా ఉత్తర్వుల్లో మాత్రం ఆ ప్రస్తావన లేదు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా జూనియర్‌ కాలేజీలు ఇస్తున్న తప్పుడు ప్రకటనలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై మార్గదర్శకాల్లో ప్రస్తావించలేదు. అలాగే విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఇంటర్‌ బోర్డు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించకపోతే ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా ప్రస్తావించలేదు. తాజా మార్గదర్శకాల్లో కొత్తది ఏమీ లేదన్నారు. వీటివల్ల ఆత్మహత్యల నివారణ ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదని ఇంటర్‌ విద్య ఐకాస ఛైర్మన్‌ డాక్టర్‌ పి మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !