YS Avinash Reddy Intermbail cancel : సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డికి షాక్‌...ముందస్తు బెయిల్‌ రద్దు !

0

మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయకూడదన్న తెలంగాణ హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని భావించిన సుప్రీం.. హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని ఈ సందర్భంగా అభిప్రాయపడిరది. 

జూన్‌ 30వ తేదీ వరకు గడువు

ఇదిలా ఉంటే వివేకా హత్య కేసు గడువును సైతం సుప్రీం పొడిగించింది. జూన్‌ 30వ తేదీ వరకు కేసు గడువును పొడగించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టేసిన తరుణంలో అవినాష్‌ తరపు న్యాయవాది.. అరెస్ట్‌ను ఒక రోజు వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే జనవరి 23న సమన్లు చేసిన సీబీఐ అరెస్ట్‌ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదని, ఇప్పుడీ 24 గంటల కోసం రిలీఫ్‌ ఇవ్వలేమంటూ సుప్రీం తేల్చి చెప్పింది. ఇప్పటికే ఏప్రిల్‌ 30వ తేదీ లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసి, ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నెల గడువు ముగియనున్న క్రమంలో.. నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేయడం సాధ్యం కాదని సీబీఐ తరపున అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనికి సుప్రీం కోర్టు బదులిస్తూ దర్యాప్తు గడువును జూన్‌ 30వ తేదీ వరకు పొడగిస్తూ సీబీఐకి ఊరటనిచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !