YS Bhasker Reddy Arrest : వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ !

0

కడప మాజీ ఎంపీ వివేకానందా రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం కడప ఎంపీ అవినాష్‌​ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్‌​ కుమార్‌​ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసులో అవినాష్‌​ రెడ్డి తండ్రిని వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. ఆదివారం ఉదయం పులివెందులలోని అవినాష్‌​ రెడ్డి నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డి అరెస్టుకు సంబంధించిన మెమోను కుటుంబసభ్యులకు అందించి అరెస్టు చేశారు. కడప ఎంపీ అవినాష్‌​ రెడ్డి తండ్రి భాస్కర్‌​ రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో.. వారి అనుచరులు భారీగా అక్కడికి చేరుకున్నారు. భాస్కర్‌​ రెడ్డిని అరెస్టు చేసి కడపకు తీసుకెళ్తున్న సమయంలో వారు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నించారు. వారి నుంచి తప్పించిన అధికారులు భాస్కర్‌​ రెడ్డిని కడపకు తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సాయంత్రంలోపు సీబీఐ జడ్జి ముందు హాజరుపరచనున్నారు. వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డే కుట్ర దారుడనే అభియోగాలు ఉన్నాయి. 2019 సంవత్సరం మార్చి 15న వివేకా హత్య జరిగినప్పుడు తొలుత వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారనే వార్తను మొదట ప్రచారం చేసింది భాస్కర్‌ రెడ్డే అనే ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రచారం చేయటంతో పాటు.. సాక్షాలు చెరిపేయడంలో భాస్కర్‌ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ వెల్లడిరచింది. 

ఆధారాలను సేకరించినట్లు సీబీఐ

వివేకా హత్యకు ముందు సునీల్‌ యాదవ్‌.. భాస్కర్‌ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలను సేకరించినట్లు సీబీఐ పేర్కోంది. సునీల్‌ యాదవ్‌ భాస్కర్‌ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా గుర్తించినట్లు తెలిపింది. అంతేకాకుండా దస్తగిరి కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్‌ రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ వేచి చూసినట్లు.. అతను ఇంట్లో ఉన్నప్పుడు భాస్కర్‌ రెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారని సీబీఐ వివరించింది. 2019 మార్చి 14 సాయంత్రం 6:14 నిమిషాల నుంచి 6:31 గంటల వరకు భాస్కర్‌ రెడ్డి ఇంట్లో సునీల్‌ యాదవ్‌ ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డి ఓడిపోవడానికి భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ప్రచారం సాగింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తర్వాత వివేకానంద రెడ్డి.. భాస్కర్‌ రెడ్డి నివాసానికి వెళ్లి భాస్కర్‌ రెడ్డిని, అవినాష్‌ రెడ్డిని, దేవి రెడ్డిని తీవ్రస్థాయిలో బెదిరించినట్లు ప్రచారం జరిగింది. దీంతో వివేకానంద రెడ్డి వైసీపీలో ఉంటే తమ వారికి రాజకీయ ఎదుగుదల ఉండదని భాస్కర్‌​ రెడ్డి భావించారని.. వివేకానంద రెడ్డి రాజకీయంగా ఎదగడాన్ని భాస్కర్‌​ రెడ్డి జీర్ణించుకోలేకపోయారని సీబీఐ తెలిపింది. దీంతో దేవిరెడ్డి శివ శంకర్‌​ రెడ్డితో హత్య చేయించి ఉంటారని భావిస్తున్నట్లు సీబీఐ తెలిపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !