YS Sharmila : సహనం కోల్పోయి పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల !

0

నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర దీక్షకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. లోటస్‌ పాండ్‌ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వైఎస్‌ షర్మిల వాగ్వాదానికి దిగారు. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో వారిని షర్మిల తోసేసి మరి బయటకు వచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిలను అడ్డుకోగా.. ఆమె ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారు. ఓ ఎస్సైపై చేయి చేసుకోగా.. మాపై ఎందుకు చేయి వేస్తున్నారని ఎస్సై షర్మిలను ప్రశ్నించారు. నిరుద్యోగ ధర్నాకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోల్లో ఈ విషయం అర్ధమవుతుంది. చివరకు షర్మిలను మహిళా పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వైఎస్‌ షర్మిల తీరుతో పోలీసులు చుక్కలు చూశారు. అడ్డుకుంటున్న మహిళా కానిస్టేబుళ్లను నెట్టేయడం చేయగా.. పురుషులను ప్రశ్నిస్తూ వచ్చారు. అలా నడుచుకుంటూ వస్తున్న ఆమె తన కాన్వాయ్‌ ఎక్కే ప్రయత్నం చేశారు. దీనితో అక్కడి పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. దీనితో ఆమె తన వాహనం నుండి దింపి పోలీస్‌ వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడే ఉన్న ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకున్నారు. దీనితో ఆ ఎస్సై తిరిగి ప్రశ్నించగా ఆమె కూడా అంతే ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. చివరికి ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.అయితే అరెస్ట్‌ క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నారు షర్మిల. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 330 పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. షర్మిల అరెస్ట్‌ అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వైఎస్‌ విజయమ్మ చేరుకున్నారు. షర్మిలను పరామర్శించేందుకు విజయమ్మ రాగా.. ఆమెను లోపలికి అనుమతించలేదు.

కాగా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై వైఎస్‌ షర్మిల ఇతర పార్టీ నాయకులతో కలిసి బీఆర్‌ఎస్‌పై పోరాడడానికి కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారు. కానీ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి నిరాకరించగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు షరతులతో కూడిన దీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో షర్మిల సోమవారం నిరుద్యోగ దీక్షకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !