నెల్లూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కాలేజ్‌లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని అబార్షన్ కారణంగా తరగతిగదిలోనే మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల వెల్లడిరచిన వివరాల ప్రకారం.. మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 11న క్లాస్ మేట్స్ అంతా అంతా బయట ఉండగా.. ఆమె తరగతి గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. కంగారుతో స్నేహితలు తలుపులు బద్దలుకొట్టి చూడగా క్లాస్ రూమ్‌లో తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా.. పక్కనే 6 నెలల పిండం ఉంది. తోటి విద్యార్థులు హుటాహుటిన తల్లిని, పిండాన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి కంప్లైంట్ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లాస్ రూమ్‌లోనే అబార్షన్ అయ్యిందా? లేదా యూట్యూబ్ వీడియో ద్వారా తనకు తానే అబార్షన్ చేసుకుందా? అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. యువతి సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని డేటా ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారు డ్రైవరుతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
Young Girl Dies in College ClassRoom: క్లాస్‌రూమ్‌లో యువతి శవం...అసలు ఏమి జరిగింది ?
ఏప్రిల్ 15, 2023
0
Tags