ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఏకంగా మూడు నిమిషాలకు పైగా ఉన్న ఈ టీజర్ చివర్లో మాత్రమే అల్లు అర్జున్ ఎలా ఉంటాడో చూపించారు. అయితే పుష్ప 2పై అంచనాలు పెంచేందుకు సుకుమార్ బాహుబలి 2 స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నట్టే కనిపిస్తోంది. బాహుబలి సినిమాకు అంత ఆదరణ రావడానికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్ బాగా వైరల్ అయింది. అందుకే సుకుమార్ పుష్ప 2కు కూడా జాతీయస్థాయిలో అంతే బజ్ తేవడానికి వేర్ ఈజ్ పుష్ప ? అనే ప్రశ్నను ప్రచార అస్త్రంగా పెట్టుకున్నాడు.. అంతవరకు బాగానే ఉంది. ఇక మూడు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉన్న టీజర్‌లో టీవీ వార్తల బిట్లుతో క్రేజ్ తీసుకురావడానికి ప్రయత్నించాడు. వేర్ ఈజ్ పుష్పా ? అన్న సస్పెన్స్ కొనసాగించలేకపోవటం చూశాక సుకుమార్ పనితనం మీద బాగా నమ్మకం ఉన్నవాళ్లందరికీ మబ్బులు తొలగిపోయాయి అని చెప్పవచ్చు. వాస్తవానికి దూరంగా ఉందని చెప్పవచ్చు. ఎలా అంటే చూడాలనిఉంది అనే చిరంజీవి సినిమా 1998లో విడుదలైంది. టి.వి 9 అనేది 2004 లో స్థాపించబడిరది. తర్వాత కొద్ది రోజులకి లైవ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడైతే ఏకంగా టి.వి.9 లోగోతో ఇంటర్వ్యూలు చేశారు. లాజిక్‌లు మిస్సయ్యారు. అప్పుడు ఎక్కువగా ఉంది రేడియోలే. టి.వీ.లు కూడా వాడకం తక్కువ. ఇంకా చెప్పాలంటే సిటీ కేబుల్‌లో బ్రేకింగ్‌న్యూస్ అని చెప్పే రోజులు కావు. డి.డి. న్యూస్‌లో శాంతిస్వరూప్ గారు ఇప్పుడే అందిన తాజా వార్త అని చదివే వారు.
రేపు సినిమా ఎలా ఉంటుంది ? సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. కానీ సుకుమార్ అనే ఒక ఇంటిలిజెంట్ డైరెక్టర్ ఇలా ఎలా చేశాడబ్బా అనిపించక మానదు. అవన్నీ వదిలేసి పరమ రొటీన్ స్టైల్ లో ఈ టీజర్‌ను కట్ చేసినట్టుగా ఉంది. బాహుబలి 2 విషయంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు ? చంపాడు అనే ప్రశ్నకి సమాధానం దొరకక జనాల్లో ఆసక్తి పెరిగింది. పైగా బాహుబలి 2లో కట్టప్ప పాయింట్ చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ఉంది. అయితే పుష్ప 2 విషయంలో ఇప్పుడు అది లేదు. వేర్ ఈజ్ పుష్ప అని ఊరిస్తూ వచ్చి చివర్లో వేర్ ఈజ్ పుష్పకి జవాబు చెప్పేయటమే ఇక్కడ పెద్ద మైనస్ అయింది. అందుకే ఇప్పుడు సుకుమార్ లాంటి మేధావి తలలో నుంచి వచ్చిన ఆలోచన ఇదేనా అని విస్తుపోతున్నారు. పోస్టర్ కూడా గత సినిమాల ప్రభావం కనిపిస్తోంది. కాంతారా, కాంచన స్పురించకమానవు. విలన్‌ని చంపడానికి రూపం మార్చుకోని వెళ్ళటం చాలా సినిమాల్లో చూశాం కూడా.
ఇక కథలోకి వెళితే...పుష్పని పెళ్ళి చేసుకున్న తర్వాత జీవితాన్ని ఆనందంగా గడిపేస్తుంటాడు. సంపాదించిన సొమ్ముతో తన చుట్టు ఉన్న ప్రజల అవసరాలు తీరుస్తూ అందరికీ అభిమానం పొందుతాడు. ఈ క్రమంలో లేని ఇంటి పేరును తిరిగి తెచ్చుకుంటాడు. అంతలోనే అనసూయ రావురమేష్ ప్లేస్‌లో ఎమ్మేల్యే అవుతుంది. ఒక వైపు షెకావత్, మరోవైపు అనసూయ, సునీల్ మరోవైపు జాలిరెడ్డి అందరూ జట్టుకడతారు. పుష్పని ఎన్‌కౌంటర్‌లో లేపేయాలి అనుకున్నప్పుడు తప్పించుకుని పోతాడు. శ్రీవల్లీ పుష్పని తప్పిస్తుంది. దట్టమైన అడవిలో పెట్టి కాపాడుకుంటుంది.తను బ్రతికేఉన్నా అని చెప్పడానికి పులి సీన్ పెట్టటం జరిగింది. తిరిగి కోలుకున్న పుష్ప రివేంజ్ తీర్చుకుంటాడు. శ్రీవల్లీ ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. ప్రీక్లైమాక్స్ నుండి ఒక్కొక్కరినీ చంపుతాడు. శ్రీవల్లీ చేతిలో జాలిరెడ్డి చనిపోతాడు. అనసూయ, సునీల్‌ని, చివరికి షెకావత్‌ని చంపేయటంతో సినిమా ముగుస్తుంది.