RBI sensation decision : రూ. 2000 నోట్లను ఉపసంహరించుకున్న RBI

0


రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు తెలిపింది. ఇకపై వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోపు మార్చుకోవాలని వినియోగదారులకు సూచించింది.రూ.2వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా  మర్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేశామని ఆఆర్‌బీఐ స్పష్టం చేసింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు  పేర్కొంది. ఒక విడతలో రూ.20వేల చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. డిపాజిట్‌ విషయంలో ఎలాంటి నిబంధనలు విధించలేదు.  త్వరలో ఎన్నికలు రానుండటంతో పార్టీలు, నాయకులు అంతా దొంగ సొమ్మును 2000 నోట్లలోకి మార్చుకుని సిద్ధం చేసుకోగా వాటిపై నిషేధం విధంచి పార్టీలకు పెద్ద దెబ్బ కొట్టింది. ఎంత మంది జీవితాలు తల్లక్రిందులు కానున్నాయో త్వరలో తెలియనుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !