ఏజెంట్లను నియమించుకున్నాడు
గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నా పోలీసులకు చిక్కకుండా రాకేష్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. తనలాగే వ్యాపారంలో నష్టపోయిన బాచుపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, మణికొండకు చెందిన సూర్యప్రకాశ్‌లను రాకేష్ ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఇద్దరినీ గోవా పంపించి గాబ్రియెల్ నుంచి కొకైన్ తెప్పించాడు. రాకేష్, శ్రీనివాస్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌తో పాటు వీళ్లకు కొకైన్ విక్రయించిన నైజీరియన్ విక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నైజీరియన్ గాబ్రియెల్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.1.3 కోట్ల విలువ చేసే 303 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
వాట్సప్ గ్రూప్‌లో రహస్యంగా కొకైన్ సరఫరా
గాబ్రియెల్ నెల క్రితం నైజీరియా వెళ్లాడు. తన భార్య గర్భవతి కావడంతో నైజీరియా వెళ్లిన గాబ్రియెల్ కొకైన్ సరఫరాను విక్టర్‌కు అప్పగించాడు. కొకైన్ సరఫరా చేసేందుకు హైదరాబాద్ వచ్చిన విక్టర్‌ను ఎస్‌వోటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ బానిసలకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఈ ముఠా.. వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి రహస్యంగా కొకైన్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాట్సప్‌లో డేటా కనిపించకుండా ఎప్పటికప్పుడు డిలీట్ చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 6 సెల్‌ఫోన్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. అందులో ఉన్న డేటాను రికవరీ చేసి దర్యాప్తు చేయనున్నట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.