కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు
కర్ణాటక అసెంబ్లీ కాంగ్రెస్సే హస్తగతం చేసుకుంది. తాజా కౌంటింగ్‌లో ఆ పార్టీ 122 స్థానాల్లో లీడిరగ్‌లో ఉంది. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 113 సీట్లు వచ్చిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు అవుతారన్నదే కీలకంగా మారింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ లేదా సీనియర్ సిద్ధిరామయ్య ఈ ఇద్దరిలో ఎవరు సీఎం పోస్టును చేజిక్కించుకుంటారో ఇంకా క్లారిటీ లేదు.
ఎన్నికల ప్రచారంలో ఇద్దరూ పార్టీ కోసం విస్తృతంగా టూర్ చేశారు. కర్ణాటక సీఎంగా సిద్ధిరామయ్యకే ఎక్కువ ఛాన్సు ఉందని పార్టీలోని వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం కోసం డీకే శివకుమార్ తీవ్రంగా కష్టపడ్డారు. అయితే శివకుమార్‌కు మంచి పోస్టే దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో ఇద్దరి మధ్య పవర్ షేరింగ్ ఫార్ములా కుదిరినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్‌కు తొలుత ఓ ఉన్నత పోస్టు ఇచ్చినా.. ఆ తర్వాత ఆయనే ఆ రాష్ట్ర సీఎం అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.