కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం అధికారాలపై సుప్రీంకోర్ట్ తీర్పు వెల్లడిరచింది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, ప్రజలచే ఎన్నిక కాబడిన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయంటూ తీర్పు చెప్పింది. దిల్లీలో హక్కుల పోరాటానికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ దిల్లీ గవర్నమెంట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో దిల్లీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. ఇప్పటి వరకు సేవలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయాలు తీసుకునేవారు, ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం ఈ హక్కును పొందింది. ఇప్పుడు దిల్లీలో పోస్టింగ్‌లో ఉన్న అధికారులు, ఉద్యోగుల బదిలీ, పోస్టింగ్, నియామకాల విషయంలోదిల్లీ ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యంగా పరిగణించబడుతుంది.
ఎన్నిక కాబడిన ప్రభుత్వానికే హక్కులు !
దిల్లీ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ ప్రభుత్వ పనితీరుపై కేంద్రానికి పూర్తి అధికారం ఇవ్వలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. దిల్లీ రాజ్యాంగం ఫెడరల్ మోడల్‌ను కలిగి ఉంది. ఎన్నికైన ప్రభుత్వానికి ప్రజల పట్ల జవాబుదారీతనం ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దిల్లీ హక్కులు తక్కువ. దిల్లీలో సర్వీస్‌పై ఎవరికి హక్కు ఉంటుంది అనేది ప్రశ్న. కేంద్రం జోక్యంతో రాష్ట్రాల పనితీరు ప్రభావితం కాకూడదు. కేంద్ర చట్టం లేకపోతే దిల్లీ ప్రభుత్వం చట్టం చేయవచ్చు. పాలనాధికారాలు రాష్ట్రప్రభుత్వానికే ఉండాలని తెలిపింది. దిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (మే 11) కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ శాసనసభకు ఉన్న అధికారాలన్నీ దిల్లీ ప్రభుత్వానికి ఉన్నాయి.దిల్లీప్రభుత్వానికి సేవలపై శాసన, కార్యనిర్వాహక అధికారం ఉంది. 2019లో జస్టిస్ అశోక్ భూషణ్ తీసుకున్న నిర్ణయంతో మేము ఏకీభవించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. 2019లో జస్టిస్ భూషణ్ పూర్తిగా కేంద్రానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
ఏకగ్రీవ నిర్ణయం
ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, కృష్ణ మురారి, హిమ కోహ్లీ, పిఎస్ నరసింహ పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌పై నియంత్రణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వును చదువుతున్నప్పుడు.. దిల్లీ శాసనసభ సభ్యులు, ఇతర శాసనసభల మాదిరిగానే ప్రజలచే నేరుగా ఎన్నుకోబడతారని సుప్రీంకోర్టు పేర్కొంది. సమాఖ్య నిర్మాణం పట్ల ప్రజాస్వామ్యం, గౌరవం ఉండేలా చూడాలి. అయితే, ఆర్టికల్ 239 దిల్లీ అసెంబ్లీకి అనేక అధికారాలను కల్పిస్తుందని, అయితే కేంద్రంతో సమతుల్యత సాధించిందని కోర్టు పేర్కొంది. దిల్లీ వ్యవహారాల్లో పార్లమెంటుకు కూడా అధికారం ఉంది.
ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి : సుప్రీంకోర్టు
లెఫ్టినెంట్ గవర్నర్ కార్యనిర్వాహక అధికారం శాసనసభ పరిధిలోకి రాని విషయాలపై ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం రావాలి. రాష్ట్ర ప్రభుత్వం తన సర్వీసులో ఉన్న అధికారులపై నియంత్రణ లేకపోతే.. వారు వారి మాట వినరు. దిల్లీ ప్రభుత్వం కూడా ఇదే వాదనను కోర్టులో వినిపించడం గమనార్హం. అసెంబ్లీకి హక్కు లేని వాటిపై తప్ప అధికారులపై దిల్లీ ప్రభుత్వం నియంత్రణ సాధించడం ఆదర్శవంతమైన పరిస్థితి అని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ ప్రభుత్వ సలహా, సహాయంతో వ్యవహరిస్తారని తాము పునరుద్ఘాటించాలనుకుంటున్నాము అంటూ సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఇందులో సేవలు కూడా ఉన్నాయని తెలిపింది. పోలీసు, శాంతిభద్రతలు, భూమి విషయంలోదిల్లీ శాసనసభకు హక్కు లేదని తెలిపింది. అంటే ఈ కేసుల్లో మినహా మిగిలిన శాఖల అధికారులపై దిల్లీ ప్రభుత్వం నియంత్రణ పొందుతుందని తెలిపింది.
హర్షం వ్యక్తం చేసిన ఆప్..
సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు. ’’ నేను సుప్రీమ్ కోర్ట్ ఫైసలే కో జనతంత్ర కి జీత్ బతాయా ’’ సుప్రీంకోర్టు తీర్పును ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.