Haldi Function with bear : బీర్‌తో మంగళస్నానం !

0


  • ఆచారాలకు, సంప్రదాయాలకు మంగళం !
  • వెరైటీ కోసం, పాపులారిటీ కోసం వింత పోకడలు !
  • తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్‌లు ! 

వెర్రి వెయ్యిరకాలు అన్నది పాత కాలపు సామెత. అది కొంత మందికి వేపకాయ అంత ఉంటే...కొందరికీ తాటికాయంత ఉంటుంది అంట. ఈ పోలిక దేనికంటే... పవిత్రమైన పసుపు నీళ్ళతో వరుడికి మంగళస్నానం చేపించే ఆచారాన్ని తోసిరాజని  బీర్‌తో మంగళస్నానం చేయించి వింత ఆచారానికి తెరతీశారు కొందరు ప్రభుద్దులు.  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలనో, వెంటనే పాపులర్‌ అయిపోవాలనో తెలియదు కానీ కొందరు అయితే మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. కొన్ని సార్లు ఇలాంటి చేష్టలు వికటించి, తీవ్రవిమర్శలు ఎదుర్కొవలసి వస్తుంది. ఆచారాలతో పాటించాల్సిన పెళ్లి తంతుని అపహాస్యం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వారి వల్లే ఆచారాలన్నీ మంటగలిసి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటన నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో జరిగింది. 

పాపులారిటీ కోసం

నాగర్‌ కర్నూల్‌ జిల్లా తాడుర్‌ మండలం ఐతోల్‌ గ్రామంలో జరిగిన ఓ హల్దీ కార్యక్రమం విమర్శలకు వేదికైంది. వరుడు తలపై బీర్‌తో స్నానం చేయించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన పసుపు నీటితో వరుడు, వధువు తలపై స్నానం చేయించాల్సింది పోయి ఇలా బీర్‌తో చేయించడం ఏంటని విమర్శలు ఎక్కుపెడుతున్నారు నెటిజనులు. వెరైటీ, పాపులారిటీ కోసం ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో  వెరైటీ కాస్త వికటించి విమర్శలకు వేదికైంది. పెళ్ళి మీద ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తులే ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. వేద మంత్రాలతో రెండు కుటుంబాలను, రెండు మనసులను కలిపే వందేళ్ల జీవితానికి వేదికగా నిలిచే ఈ పెళ్లి వేడుక రోజురోజుకూ వింత పోకడలకు దారితీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి అనేది చాలా పవిత్రమైన, సంప్రదాయమైన వ్యవహారం అని , వివాహ వేడుకలో మంగళస్నానం అత్యంత పవిత్రమైన కార్యక్రమం అని పెద్దలు చెబుతున్నారు. బీరుతో కూడిన మంగళస్నానం సంప్రదాయానికి విరుద్ధమని చెప్పబడిరది. ఇలా చేయడం అపవిత్రమని అంటున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దని సూచిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, వాట్సాప్‌ స్టేటస్‌ల కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం మన సంప్రదాయాన్ని అవమానించినట్లేనని అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !