సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ భాజపా నేతలు సీఎం కాన్వాయ్‌కి ఎదురెళ్లి నిరసనకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ భాజపా నేతను పోలీసు అధికారి తన రెండు కాళ్ల మధ్య ఉంచి నిలువరించే ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరుపై విపక్ష నేతలతో పాటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.