ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదలైయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు మంచి ఫలితాలు సాధించాయి. ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో ఉత్తీర్ణత సాధించిన వారి గురించి గొప్పగా చెప్పుకునే సంస్థలు... ఎంత మంది తమ సంస్థల్లో చదివారో వారి సంఖ్య గురించి, ఫెయిల్ అయిన విద్యార్థుల గురించి ఏ మాత్రం చెప్పవు. మొదటిసారి ఆ ప్రయత్నం చేస్తోంది సమాజ్‌టుడే. ప్రముఖ కార్పొరేట్ సంస్థ శ్రీచైతన్యలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండి 10 వ తరగతి పరీక్ష వ్రాసిన విద్యార్థుల సంఖ్య 25000 మంది కాగా, వారిలో 1150 పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. రెండో అతిపెద్ద సంస్థ భాష్యం నుండి 16000 మందికి పైగా విద్యార్థులు 10 వ తరగతి పరీక్ష వ్రాయగా వారిలో 760 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అలాగే మూడో అతిపెద్ద సంస్థ అయిన నారాయణ నుండి 10600 మంది 10 వ తరగతి పరీక్ష వ్రాయగా సుమారు 350 మంది విద్యార్థులు పరీక్ష తప్పారు.
Students Faild in Corporate Schools : శ్రీచైతన్య స్కూల్స్‌లో 10 వ తరగతి ఫెయిల్ అయినవారు ఉండరా !
మే 06, 2023
0
Tags