Wife Swapping: జీవిత భాగస్వాముల మార్పిడికి నో చెప్పిన మహిళ హత్య !

0
పుర్రెకో వెర్రి అనే నానుడి కేరళలోని ఓ భర్తకు కరెక్ట్‌గా సరిపోతుంది. పుర్రెలో పుట్టిన విచిత్రమైన కోర్కెను భార్య ముందు పెట్టాడు. ఆమె దానికి నిరాకరించేసరికి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. చివరికి కడ తేర్చాడు. ఏ స్త్రీ అయినా తన భర్తను తప్ప మరొకరిని కలలో కూడా ఊహించుకోదు. కనీసం పరాయి పురుషులతో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతుంటుంది. అలాంటిది ఓ దుర్మార్గపు భర్త.. పరాయి పురుషులతో గడపాలని ఆమె (26)పై ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ వ్యవహారంపై బాధితురాలు జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్త సహా ఏడుగురిని అరెస్టు చేశారు. 

రక్తపు మడుగులో 

అప్పటి నుంచీ ఆమె భర్తకు దూరంగా కొట్టాయంలోని పుట్టింట్లో నివాసం ఉంటుంది.శుక్రవారం అందరూ ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. బాధితురాలి తండ్రి, సోదరుడు పనికి వెళ్లగా.. పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. కాసేపటి తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉండడం చూసి ఆందోళనకు చెందారు. ఇరుగుపొరుగు వారికి విషయం తెలియజేశారు. అందరూ వచ్చి చూసేసరికి శవమై కనిపించింది. తన కుమార్తెను ఆమె భర్తే చంపి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !