Lokesh Padayatra Completes 100 Days : 100 వ రోజుకి చేరిన లోకేష్‌ యువగళం పాదయాత్ర !

0
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత లోకేష్‌ ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గం మధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్‌ కట్టారు.  పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో ‘యువగళం’ పాదయాత్ర అసాంతం జాతరను తలపించింది.

100 రోజులకు పాదయాత్ర

మరోవైపు కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్‌ శ్రీమాన్‌, సీహెచ్‌ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్‌, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్‌ తదితరులు లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్టొన్నారు. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో బోయరేవుల క్యాంప్‌సైట్‌, మోతుకూరు పరిసరాల్లో 3.కి.మీ మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

మరోవైపు తెలంగాణ తెదేపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్‌ తదితరులు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !