Balakrishna new Movie Title : భగవంత్‌ కేసరి...గిప్పడి సంది ఖేల్‌ అలగ్‌ ఉంటది !

0

 

నందమూరి బాలకృష్ణ (NANDAMURI BALAKRISHNA) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (ANIL RAVIPUDI) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య 108వ చిత్రంగా షైన్‌ స్క్రీన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ‘భగవంత్‌ కేసరి’ టైటిల్‌ ఖరారు చేశారు. ఇంతకుముందెప్పుడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. అంతేకాదు, అనిల్‌ రావిపూడి శైలి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమాత్రం మిస్‌కాకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం చిత్ర బృందం టైటిల్‌ను ప్రకటించింది. పోస్టర్‌ చూస్తుంటే బాలయ్య ఇంతకుముందు ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నారు. కొత్త హెయిర్‌ స్టైల్‌, చేతిలో కొత్త ఆయుధంతో బరిలో దిగారు బాలయ్య. ఇప్పటికే ఆయన లుక్‌ను రివీల్‌ చేశారు. కానీ ఆయన చేతిలో ఉన్న ఆయుధం కొత్తగా ఆకర్షిస్తోంది.

‘గిప్పడి సంది ఖేల్‌ అలగ్‌’ అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ‘అన్న దిగిండు.. ఇగ మాస్‌ ఊచకోత షురూ’ షైన్‌స్క్రీన్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలకృష్ణ సరసన కాజల్‌ (KAJAL) కథానాయికగా నటిస్తోంది. శ్రీలీల (SRILEELA) కీలక పాత్రలో కనిపించనుంది. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ఈ చిత్రం విడుదల కానుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !