Varun Tej and Lavanya Tripati engagement : వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాటి ఎంగేజ్‌మెంట్‌ !

0

 

మెగా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జూన్‌ 9న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ విషయాన్ని వరుణ్‌ తేజ్‌ ప్రతినిధి ట్వీట్‌ చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబ సభ్యులు, కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ‘రెండు హృదయాలు.. ఒకటే ప్రేమ’ అంటూ ఓ ఇన్విటేషన్‌ కార్డ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇక వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’ చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్‌ నగర్‌లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరికీ నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !