Alcohol Causes 61 Diseases Directly : 61 వ్యాధులకు మద్యపానమే ప్రత్యక్ష కారణం !

0

పార్టీ అంటే మందు పక్కా ఉండాల్సిందే. వారాంతాల్లో ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా చిల్‌ అయ్యే సమయంలోనూ ఆల్కాహాల్‌దే అగ్రతాంబూలం. ఇక కాయాకష్టం చేసే వారికి పెగ్గు పడనిదే బండి నడవదు. ఇలా రోజూవారీ జీవితంతో మందు ఓ భాగమైంది. అయితే, తాజాగా విడుదలైన పరిశోధనల్లో తేలిన విషయాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌, పెకింగ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చైనా కడూరీ బయోబ్యాంక్‌ నుంచి డేటాను ఉపయోగించి, పరిశోధనలు చేశారు. ఇది 2004 నుంచి 2008 మధ్యకాలంలో చైనా అంతటా పది విభిన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 5,12,000 మంది పెద్దలపై ఏకంగా 12 ఏళ్లు పరిశోధనలు చేశారంట. మందు వినియోగంతో అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని ఈ పరిశోధనలు తేల్చాయి. ఆల్కహాల్‌ వినియోగాన్ని తగ్గించినప్పటికీ 60 కంటే ఎక్కువ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని రిపోర్టులో వెల్లడైంది. ఇందులో ముఖ్యంగా కంటిశుక్లం, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు వంటి అనేక వ్యాధులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మూడు మిలియన్ల మంది ఆల్కహాల్‌ వినియోగంతో మరణిస్తున్నట్లు అంచనా వేశారు. ఇది చాలా తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో విపరీతంగా పెరిగిందని ఖఖలోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వెల్లడిరచింది. ఇందులో చైనాలోని పెకింగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు కూడా పాల్గొన్నారట. 12 సంవత్సరాలుగా చైనాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 512,000 మందిపై పరిశోధనలు చేశారు. 200 కంటే ఎక్కువ వివిధ వ్యాధులపై మద్యపానం ఆరోగ్య ప్రభావాలను అంచనా వేసినట్లు వారు పేర్కొన్నారు.

దుష్పరిణామాలే అధికం 

నేచర్‌ మెడిసిన్‌లో ప్రచురించిన నివేదికల మేరకు.. 207 వ్యాధులకు పరోక్షంగా, 61 వ్యాధులకు ప్రత్యక్షంగా మద్యం కారణమవుతుంది. ప్రధానంగా ఈ అధ్యయనంలో పురుషులు 98శాతం పాల్గొనగా.. రెండు శాతం మంది మహిళలు పాల్గొన్నారంట. గౌట్‌, ఫ్రాక్చర్స్‌, క్యాటరాక్ట్‌, గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ వంటి ఆల్కహాల్‌ సంబంధితంగా గతంలో గుర్తించబడని 33 వ్యాధులు కూడా ఉన్నాయని నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌ జూన్‌ 8న ప్రచురించింది. కొత్త అధ్యయనం ఎంతో కీలకమైనదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది జనాభాలో విస్తృతమైన వ్యాధులపై మద్యపానం ప్రభావాన్ని అంచనా వేస్తుంది. సిర్రోసిస్‌, స్ట్రోక్‌, కొన్ని క్యాన్సర్‌ల వంటి అధిక మద్యపానం వల్ల కలిగే వ్యాధులను మాత్రమే కాకుండా గతంలో మద్యపానంతో సంబంధం లేని వ్యాధులపై కూడా ప్రభావం చూపించినట్లు తేలింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !