AP EAPCET RESULTS OUT : ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల !

0
ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2023 ఫలితాల్లో ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్‌ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్‌ టెన్‌ జాబితాలో ఈసారి అంతా బాలురే ఉన్నారు. ఇంజనీరింగ్‌ విభాగం మొదటి ర్యాంకు 158 మార్కులతో ఉమేష్‌ వరుణ్‌ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణా ఎమ్‌సెట్‌లో కూడా వరుణ్‌ మూడవ ర్యాంకు సాధించారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ స్ట్రీమ్‌లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్‌ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్‌ వెయిటేజ్‌ మార్కులను ఈసారి పరిగణనలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు. ఈ సంవత్సరం, ఇంటర్మీడియట్‌లో 25% మార్కులు,  ఏపీ ఈఏపీసెట్‌ 2023 స్కోర్‌లో 75% మార్కుల ఆధారంగా విద్యార్ధులకు ర్యాంకులు ప్రకటించారు. www. cets.apsche.ap.gov.in

విద్యార్థులకి అభినందనలు: బొత్స

ఏపీ ఈఏపీసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి అభినందనలు తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రతీ విద్యార్ధి గ్లోబల్‌ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నమని చెప్పారు.  విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం విద్యార్దుల మంచి భవిష్యత్‌ కోసమేనని అన్నారు. దేశంలోనే టాప్‌ రాష్ట్రంగా ఏపీని ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య కోసం వెచ్చించే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగపడుతుందని చెప్పారు.  విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ధ పెరిగిందని అన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !