CM Kcr Lays Foundation for Nims Expansion : నిమ్స్‌ ‘దశాబ్ది బ్లాక్‌’కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌.

0

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక వైద్య సంస్థ నిమ్స్‌లో కొత్తగా నిర్మించే దశాబ్ధి బ్లాకుకు, విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. బుధవారం జరిగిన శుంకుస్థాపన కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.  1571 కోట్ల రూపాయలతో ప్రస్తుతం నిమ్స్‌ భవనానికి ఆనుకొని ఉన్న 32 ఎకరాల స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఇందులో 2000 పడకలు ఉండనున్నాయి. ఈ కొత్త భవనంలో ఔట్‌ పేషెంట్‌, ఎమర్జెన్సీ వైద్యం కోసం ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేయనున్నారు. 32 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, 6 మేజర్‌ మాడ్యులర్‌ థియేటర్లు దీనిలో నిర్మించనున్నారు. మొత్తం మూడు బ్లాకులలో నిమ్స్‌ టవర్‌ నిర్మించనున్నారు. శంకుస్థాపన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని బంధం ఉన్నట్లు పేర్కొన్నారు. 

కరోనాను మించిన వైరస్‌ వచ్చే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌ వచ్చే అవకాశముందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వివరించారు.మానవజాతి ఉన్నన్ని రోజులు వైద్య రంగం ఉండాల్సిందే.. 2014లో 2వేల కోట్ల బడ్జెట్‌ అయితే, 2023లో 12వేల కోట్లు వైద్యశాఖకు కేటాయింపులు జరిపినట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కోసం కేంద్రాన్ని అడుక్కోకుండా ఆక్సిజన్‌ మనమే తయారు చేసుకుంటున్నామన్నారు. వందల పడకల ఆసుపత్రులను.. వేల సంఖ్యకు పెంచుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్‌లు వస్తాయి.. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదురైనా ఎదురుకునేందుకు తెలంగాణ వైద్యశాఖ రెడీగా ఉందంటూ సీఎం స్పష్టంచేశారు. బెస్ట్‌ ప్లానింగ్‌ ఆఫ్‌ సక్సెస్‌ అనే నినాదం ఉన్నత వైద్యాధికారులు మర్చిపోవద్దంటూ కోరారు. వైద్యారోగ్య శాఖలో పీఆర్‌ తక్కువ అందుకే విమర్శలు వచ్చిపడుతున్నాయి.

కొత్త భవనాలు, ఈక్విక్మెంట్‌ ప్రజలకు ఉపయోగపడాలి

వైద్యోనారాయనో హరి అంటారు. ఐఏఎస్‌లు అయినా ముఖ్యమంత్రి అయినా రోగం వస్తే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిందే. పోలీస్‌ ప్రొఫైల్‌ను పూర్తిగా మార్చి.. ఫ్రెండ్లీ పోలీస్‌ గా మార్చాము. వైద్యశాఖ ప్రజలకు చేసే సేవ ప్రజలకు తెలిసేలాగా పీఆర్‌ పెంచాలి. వైద్యారోగ్యశాఖలో ప్లానింగ్‌ ఇంకా బాగా మెరుగ్గా ఉండాలంటూ సూచించారు. కొత్త భవనాలు, నూతన ఈక్విక్మెంట్‌ తేవడం కాదు అది ప్రజలకు ఉపయోగపడాలని.. కరోనా లాంటి మహమ్మారి మళ్ళీ వచ్చినా ప్రజలకు మేమున్నాం అనే ధైర్యం డాక్టర్లు ఇవ్వాలని పేర్కొన్నారు. డాక్టర్లు పనిచేయడం లేదనే విమర్శ ఉందని.. అది తొలిగిపోయేలా మీ పనితీరు మార్చుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !