రాజేందర్ పార్టీ మారరు !
పదవి కోసం తలవంచుడు మా రక్తంలో లేదని అన్నారు. నేను పార్టీ మారను అని రాజేందర్ స్పష్టంగా చెప్పారని అన్నారు. కేసీఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇటువంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నందుకు సంతోషంగా ఉన్నామని అన్నారు. ముదిరాజ్ లు నిరసనలు చేస్తున్న సీఎంకు కనిపించడం లేదు.. వాళ్ళు చిన్న కులం వాళ్ళే అని అలా చేస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌లో చందాలు వేసుకుని కట్టిన అమరుల స్థూపాన్ని కూలకొట్టారని తెలిపారు. అమరుల స్థూపంపై ఈటల రాజేందర్ పేరు ఉందని కూలకొట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డి ఇలా వ్యహారిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారని వెల్లడిరచారు. కనీసం ఉద్యమకారుడు కూడా కానీ కౌశిక్ రెడ్డి.. జేసీబీతో అమరుల స్థూపాన్ని కూలకొట్టాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి గవర్నర్‌ను సైతం నోటితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని తెలిపారు. గవర్నర్ ను తిట్టిన తరువాత కేటీఆర్.. హుజురాబాద్ కు వెళ్ళి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాడని పేర్కొన్నారు.
కేసులతో భయపెడుతున్నారు
మహేందర్ గౌడ్ అనే సర్పంచ్ ను ఏమీ చేయకున్నా కేసులు పెట్టారని విమర్శించారు. మహేందర్ గౌడ్ ను కొడుతుంటే వీడియోలు చూపెట్టాలని అన్నాడు అంటా అని అన్నారు. ఏ ఆఫీస్ కు వెళ్లినా కౌశిక్ రెడ్డి చెప్పారని అధికారులు అంటున్నారని వెల్లడిరచారు.కౌశిక్ రెడ్డి చెబితేనే కేసు నమోదు చేస్తామని పోలీసులు సైతం అంటున్నారు అంటా అని తెలిపారు. మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ఎంపీడీఓను యూజ్ లెస్ ఫెల్లో అంటూ తిట్టాడంటా అని వెల్లడిరచారు. రైతు సమస్యలపై ఒక రైతు మాట్లాడితే అతనిని బూతులు తిట్టాడు అంటా అని పేర్కొన్నారు.