CM Jagan: ఏపీ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్

0

గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. విజయవాడలో నిర్వహించిన ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమంలో  సీఎం జగన్‌ పాల్గొన్నారు. టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగన్‌ నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై.. రేపు ప్రపంచానికి ఫలాలు అందించాలని ఆకాంక్షించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్‌.. షైనింగ్‌ స్టార్‌, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ మనదని ఉద్ఘాటించారాయన. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాం.  కరిక్యులమ్‌ కూడా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చింది.  ప్రతి విద్యార్థికి ట్యాబులు అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతోనే.. విద్యా దీవెన, విద్యా వసతి చేపట్టాం.  విద్యార్థుల ఫీజుల్ని ప్రభుత్వమే భరిస్తోంది. అత్యుత్తమ కంటెంట్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు టెక్నాలజీ అందించే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో సీటు తెచ్చుకుంటే ఆ విద్యార్థికి అండగా ఉంటాం.  చదువులకు పేదరికం ఆటంకం కాకూడదని.. ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ చదవాలని సీఎం ఆకాంక్షించారు. చదువు కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడం. మీ జగన్‌ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులను ఉద్దేశించి స్పష్టం చేశారాయన.

ప్రోత్సాహకాలిలా..

జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ నెల 12 నుంచి వారంపాటు సత్కారాలు నిర్వహించనున్నారు. పదవ తరగతిలో ఫస్ట్‌ ర్యాంకర్‌కు లక్ష. ద్వితీయ ర్యాంక్‌ రూ.75 వేలు, తృతీయ ర్యాంక్‌కు రూ. 50 వేలు ప్రొత్సాహకం అందించనుంది ఏపీ ప్రభుత్వం. 42 మందిని ఎంపిక చేసి అందిస్తారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !