ఏమిటి నిన్ హైడ్రీన్ పరీక్ష..
వివేక హత్య జరిగిన ప్రాంతంలో వివేకా రాసినదిగా చెప్తున్న లేఖ ఇప్పుడు కీలకంగా మారింది. మరోరకంగా చెప్పాలంటే సాక్ష్యంగా మారనుంది. ఒకేవేళ ఎవరైనా బలవంతంగా ఆ కాగితంగా రాయించినట్లతే అనుమానుతుల వేలిముద్రలను గుర్తించడమే ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశం. రసాయనిక ప్రయోగం ద్వారా లేఖ పై వేలిముద్రలను కనుగొంటారు. నిన్ హైడ్రీన్ ఫార్ములా సి9, హెచ్6, ఓ4. దీన్ని యథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. వివేక రాసిన లేఖపై ఆ ద్రావణాన్ని స్ప్రే చేస్తారు లేదా అందులో ముంచి బయటకు తీస్తారు. పదినిమిషాల తర్వాత ఆ లేఖ పై ఎక్కడెక్కడ వేలిముద్రంలో ఉన్నాయో ఆ ప్రాంతం ఊదా రంగు కలర్ లోకి మారిపోతుంది. దాన్నిబట్టి నిందితులెవరో తెలుసుకోవచ్చని సీబీఐ చెబుతోంది. నాలుగేళ్ల క్రితం హత్య జరిగిన తర్వాత ఆ లేఖను ఎంతో మంది పట్టుకున్నారు. పోలీసులు, సీబీఐ అధికారులు, కుటుంబీకులు పరిశీలించారు. వీరందరి వేలిముద్రలు ఆ లేఖపై పడి ఉంటాయి. దాంతో అసలు నిందితులెవరో తెలుసుకోవడం చాలా క్లిష్టమైన అంశంగా మారనుంది. ఏది ఏమైనప్పటికీ నిన్ హైడ్రీన్ పరీక్ష అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.