మిల్కీ బ్యూటీ తమన్నా అందంతోనే కాదు నటన, డ్యాన్స్‌లతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ అమ్మడు బిజీగా ఉంది. ఈ మధ్య బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించింది. విజయ్ వర్మ తనపై ఎంతో శ్రద్ధ చూపుతాడని.. అతడితో ఉంటే సంతోషంగా ఉంటానని తమన్నా చెప్పింది.
మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది
‘‘నేను విజయ్ వర్మతో ఎంతో చనువుగా ఉంటున్నానంటే దానికి కారణం అతడు కేవలం నా సహనటుడని మాత్రమే కాదు.. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే మనం సంతోషంగా ఉంటామనే భావన మనకు కలగాలి. విజయ్‌తో ఉంటే నాకు అలానే ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలతో కలిసి నటించాను. వాళ్లందరి కంటే నాకు విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. అతడు నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, నాకు కష్టం వస్తే నాతోనే ఉంటాడనే నమ్మకం ఉంది. ఏ రంగంలోనైనా ముఖ్యంగా సినీ పరిశ్రమలో మనం ఎదుగుతున్నామంటే కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. విజయ్ అలాంటి వాళ్ల నుంచి నన్ను రక్షిస్తాడు.
మా ఇద్దరి మధ్య మంచి ఆర్గానిక్ బంధం ఉంది
నా కోసం నేను ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వర్మ వచ్చాడు. అతడు నాపై ఎంతో శ్రద్ధ వహిస్తాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడే నా సంతోషం ఉంది. మా ఇద్దరి మధ్య మంచి ఆర్గానిక్ బంధం ఉంది’’ అని తమన్నా చెప్పింది. ‘లస్ట్ స్టోరీస్2’ సెట్స్‌లోనే వాళ్లిద్దరి మధ్య బంధం మొదలైనట్లు తెలిపింది. దీంతో నెటిజన్లంతా ఈ ప్రేమజంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తమన్నా త్వరలోనే హైదరాబాదీ కోడలు కానుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘లస్ట్ స్టోరీస్2’ జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది.