Eenadu Articles against Jagan govt : రాజగురువు రామోజీ రాతలకి విశ్వసనీయత ఎంత ?

0

రామోజీ రాతలు గురివింద గింజ సామెతలా ఉంటాయి. నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా కథనాన్ని వండి వార్చగల నేర్పరితనం రాజగురువు పత్రిక సొంతం. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కల్పితాలతో కనికట్టు చేయగల సమర్థత కూడా ఆయనకే దక్కుతుంది. తెలుగు జర్నలిజంలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. అదే జర్నలిజం విలువలను పాతాళానికి దిగజార్చడానికి కూడా వెనుకాడని వైనం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా తన అడుగులకు మడుగులు వత్తాలని పరితపించే మనస్తత్వం రామోజీరావుది. అంతిమంగా మాత్రం చంద్రబాబుకి శ్రేయస్కరంగా ఉండాలి. ఆయన బాగుండాలి. ఆయన బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలను నమ్మించాలి. ఇందు కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనుకాడరు రాజగురువు రామోజీరావు. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్‌.. నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్‌ అనే సినిమా డైలాగ్‌ రామోజీరావుకు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎక్కడో పచ్చళ్ల వ్యాపారంలో అడుగుపెట్టి.. తరువాత పత్రికా రంగంలో రాణించి తెలుగు రాజకీయాలను శాసిస్తూ వచ్చారు రామోజీరావు. మీడియో మొఘల్‌గా అవతరించి రాష్ట్ర రాజకీయాలను బాగా వంటపట్టించుకున్నారు. ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తి.. అదే ఎన్టీఆర్‌ను పాతాళానికి తోసేశారు. అటువంటి రాజగురువుకు ఫస్ట్‌ టైమ్‌ రాజశేఖర్‌ రెడ్డి బ్రేకులు వేయగలిగారు. ఇప్పుడు జగన్‌కు ఎదురెళ్లి ఇబ్బందులు పెడుతున్నారు.

అనుకూల రాతలు...

అదే సమయంలో జగన్‌ని సైతం రామోజీ అదే స్థాయిలో ఢీకొడుతున్నారు. తనకున్న మీడియాతో గట్టిగానే ఎదుర్కొంటున్నారు. చంద్రబాబుకు పూర్వ వైభవం కల్పించాలని తహతహలాడుతున్నారు. జగన్‌ సర్కారుపై విషపు రాతలతో రెచ్చిపోతున్నారు. బలమైన కథనాలతో దడ పుట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా యుగం అని మరిచిపోతున్నారు. ఈనాడు ఏది రాస్తే అది నిజం అని నమ్మే రోజులు పోయాయి. ప్రభుత్వాన్ని, అభ్యర్థులను భయపెట్టి తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి అని అందరికీ ఇట్టే అర్థం అవుతోంది. అంతిమంగా చంద్రబాబుకి లబ్ధి చేకూర్చడానికి మాత్రమే అని తెలిసిపోతుంది. నిన్న మాచర్ల నియోజకవర్గం గురించి రాస్తూ, ఆటవిక రాజ్యం అని బేనర్‌ ఐటమ్‌తో విషపు రాతలు రాశారు. గత 15 ఏళ్ళుగా టిడీపీ గెలవని మాచర్ల నియోజకవర్గం గురించి అంతా నెగిటివిటీతో నింపేశారు. అక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేదనట్టు కట్టుకథలు అల్లారు. కానీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్థి, సంక్షేమం గురించి రాయటం మరచిపోయారు. ఏనాడైనా చంద్రబాబుకి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా వార్తలు రాశారా ? చంద్రబాబు అసలు తప్పులే చేయలేదా ? కేంద్రం స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వమని చెప్పిన సందర్భంలో చంద్రబాబు నాలుకల ఎటుతిరిగితే అటు కథనాలు ఈనాడు మార్చలేదా ? ఏతావాతా తెలుగుదేశానికి ఆయాచిక లబ్ధి చేకూర్చడానికి ఈ రాతలే ఉదాహరణ. రామోజీని ఇబ్బందులు పెడుతున్న జగన్‌ని, ఆయన ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టటమే ఆయన లక్ష్యంగా తెలుస్తోంది. అదే క్రమంలో చంద్రబాబు అనుకూల కథనాలతో రోత పుట్టిస్తున్నారు. 

అప్పుడు చంద్రబాబు నివాసం జప్తు...ఇప్పుడు లింగమనేని ఇంటి జప్తు !

కృష్ణానది కరకట్టలపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని తొలగించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మే 15న ఆ ఇంటిని జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. అప్పుడు ఈనాడులో చంద్రబాబు నివాసం జప్తు అని కథనం వచ్చింది. అదే ఇంటి జప్తునకు ఈ రోజు కోర్టు నోటీసు జారీచేసింది. ఇప్పుడు అదే ఈనాడు లింగమనేని ఇంటి జప్తు అని కథనం ప్రచురించింది. దీంతో రాజగురువు రాతలకు పార్వ్వాలు వేరు. అంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగులు వెలుస్తున్నారు. తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు క్విడ్‌ ప్రోకు పాల్పడ్డారన్నది జగన్‌ సర్కారు ఆరోపణ. అమరాతి రాజధాని భూముల విషయంలో లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించారని.. చాలారకాలుగా లబ్ధి చేకూర్చారని.. అందుకే కృష్ణానదిపై తన అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకున్న గెస్ట్‌ హౌస్‌ చంద్రబాబుకు ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్మాణమని జగన్‌ సర్కారు జప్తునకు ఆదేశించింది. తరువాత ఇది కోర్టు పరిధిలోకి వెళ్లడంతో కోర్టు కూడా అదే నోటీసులు జారీచేసింది. కానీ ఈనాడు పత్రిక మాత్రం విభిన్నంగా స్పందించింది. తనకున్న రోత విధానాన్ని బయపెట్టుకుంది. అందుకే ఇప్పుడు సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కైంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !