Gandeevadhari Arjuna Teaser : టాలీవుడ్‌ జేమ్స్‌బాండ్‌గా వరుణ్‌తేజ్‌...గాండీవధారి అర్జున టీజర్‌ రిలీజ్‌ !

0

టాలీవుడ్‌ జేమ్స్‌ బాండ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త చిత్రం ‘గాండీవధారి అర్జున’. యాక్షన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్‌ అయిన ప్రీ టీజర్‌ మూవీ ఎలా ఉండబోతుందో అని హింట్‌ ఇచ్చేసింది. ప్రీ టీజర్‌ లో ఓ రేంజ్‌ యాక్షన్‌ స్టంట్స్‌ చూపించి ఆడియన్స్‌ని థ్రిల్‌ చేశారు. తాజాగా ఇప్పుడు ఫుల్‌ టీజర్‌ ని రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ చూస్తుంటే మూవీ స్టోరీ మొత్తం ఫారిన్‌ లోకేషన్లలోనే జరిగినట్లు తెలుస్తుంది. ఇక ప్రవీణ్‌ సత్తార్‌ సినిమాలో యాక్షన్‌ ఏ రేంజ్‌ లో ఉంటుందో చెప్పనవసరం లేదు. హాలీవుడ్‌ సినిమాల తరహాలో ఛేజ్‌ సీక్వెన్స్‌, అండర్‌ కవర్‌ ఆపరేషన్స్‌, అదిరిపోయే స్టంట్స్‌.. మొత్తానికి టీజర్‌ బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పాలి. ఇక ఈ టీజర్‌ చూసిన నెటిజెన్స్‌ వరుణ్‌ కట్‌ అవుట్‌ కి పర్ఫెక్ట్‌ సినిమా పడిరది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా సాక్షి వైద్య నటిస్తుంది. వరుణ్‌ తో పాటు సాక్షి కూడా యాక్షన్‌ స్టంట్స్‌ చేయనుంది. విమలా రామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. టీజర్‌ కనిపించిన విజువల్స్‌ చాలా గ్రాండ్‌ గా ఉన్నాయి. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది.

https://youtu.be/M2r2xLnKGE8

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !