వైన్ షాప్స్ క్లోజ్ చేస్తే...మద్యం ప్రియుల పరిస్థితి ఏంటి ? దూర ప్రయాణాల్లో మద్యం తాగాలనిపిస్తే ఏం చేస్తారు ? అర్థరాత్రి షాపులు క్లోజ్ చేసిన తర్వాత మద్యం కావాలనిపిస్తే...ఎక్కడెక్కడో ఎందుకు వెతుకుతారు ? ఇక ఇలాంటి రోజులకు ఉండవు. అయితే డోంట్ వర్రీ.. బీర్ లవర్స్ కు గుడ్ న్యూస్ వచ్చింది. మీలాంటి వారి కోసమే జర్మనీలో ఓ సంస్థ ఇన్ స్టంట్ కాఫీలా.. ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కిక్కించే బీర్ కోసం బార్‌కు వెళ్లాల్సిన పనిలేదు. బీర్‌ల కోసం షాపుల కోసం తిరగక్కర్లేదు. బీర్ బాటిళ్లు, బీర్ కేసులు ఫ్రీజ్‌లో స్టోర్ చేయక్కర్లేదు. ఉన్న చోటే బీర్ తయారు చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత బీర్ తయారు చేసుకుని తాగేయొచ్చు. స్ట్రాంగ్ బీర్ కావాలా? లైట్ బీర్ కావాలా? లిటిల్ బీర్.. కావాలా? ఎలా కావాలంటే అంత మొత్తంలో పౌడర్ కలిపి తయారు చేసుకోవడం తాగేయడమే. అదేలా అనుకుంటున్నారా? మీ బీర్ దాహాన్ని తీర్చేందుకు ఇదిగో వచ్చేశాయి..ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ప్యాకెట్లు . జర్మనీలోని బీర్ తయారీ కర్మాగారం (జర్మనీ ఇన్‌స్టంట్ బీర్) న్యూజెల్లర్ క్లోస్టర్‌బ్రూ బీర్ పౌడర్ మిక్స్‌ను తయారు చేపింది... అవును.. మీరు చదివింది నిజమే.. నీళ్లలో కలిపితేనే బీర్ తయారయ్యేంత పౌడర్ (పౌడర్ బీర్ ) తయారు చేసింది.. ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో బీర్ సాచెట్స్ పౌడర్‌ను రిలీజ్ చేసింది.
బీర్ తయారీ ఎంతో ఈజీ..
బీర్ పౌడర్ మిక్స్.. వీటినే బీర్ సాచెట్స్ అని పిలుస్తారు. ఇంతకీ ఈ బీర్ పౌడర్‌తో బీరు తయారు చేయడం ఎలా అని ఆలోచిస్తున్నారా? బీర్ తయారు చేయడం ఎంతో ఈజీ.. బీర్ సాచెట్స్ , వాటర్, తేనే ఉంటే చాలు.. క్షణాల్లో బీర్ రెడీ.. మీ దగ్గర బకెట్ ఉన్నా సరే.. లేదంటే.. మినరల్ వాటర్ డబ్బా ఉన్నా సరే.. ఒకేసారి బీర్ పౌడర్ కలిపి బీర్ తయారు చేసుకోవచ్చు. పార్టీలు చేసుకున్నా.. ఎక్కడికి వెళ్లినా.. నురుగలు కక్కే టెస్టీ బీర్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే బీర్ పౌడర్ ప్యాకెట్ల కోసం ఆర్డర్ చేయండి. పౌడర్‌తో బీర్ తయారీకి సంబంధించి సంస్థ యూట్యూబ్ ఛానళ్లలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇనిస్టెంట్ బీర్ కావాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే. బీర్ తయారీలో ఈ పరిశ్రమలో 500 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ ఈ ఇన్‌స్టంట్ కాఫీ లేదా ప్రొటీన్ షేక్‌ను తయారు చేసే విధంగానే దీన్ని తయారు చేసింది. రెండు చెంచాల పొడిని ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఇది బీర్ కంపెనీ త్వరలో ఆల్కహాలిక్ వెర్షన్‌ను కూడా తయారు చేయనుంది. ఇనిస్టెంట్ బీర్ కూడా సాధారణ బీర్ లాగానే ఉంటుంది. బీర్ తాగేవారు ఎప్పటికప్పడు తయారు చేసుకోవచ్చు. ఈ బీర్ కాఫీ మాదిరిగానే తయారవుతుంది. జర్మనీలోని బీర్ ప్రియులకు ఈ అనుభవం ప్రారంభంలో చాలా వింతగా ఉందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఇలాంటి బీర్‌ను ప్రజలు మొదట్లో తాగడానికి ఇష్టపడరని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాపారాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కిక్ ఎక్కించే టేస్టీ బీర్ ను రుచి చూడాలంటే.. వెంటనే జర్మనీ ఇన్‌స్టంట్ న్యూజెల్లర్ క్లోస్టర్‌బ్రూ బీర్ పౌడర్ తో బీరును తయారు చేసుకోండి.
Cervejaria alemã desenvolve a primeira cerveja instantânea do mundo
— Paulo Lei (@PauloAlei) March 24, 2023
Esse é o mérito da cervejaria Neuzeller Klosterbräu, que atua nesse setor há quase 500 anos.
Basta colocar algumas colheres de pó num copo, adicionar água e misturar, após o que a bebida estará pronta pic.twitter.com/khExVRaR4O