Hostel Hudugaru Bekagiddare : దేశాన్ని తన వైపు తిప్పుకుంటున్న కన్నడ సినిమా !

0

 

గత రెండేళ్లుగా కన్నడ సినిమాలు సంచలన విజయాలు అందుకుని అన్ని భాషల సినిమాలను డామినేట్‌ చేస్తున్నాయి. సొంత కథలను కాకుండా రీమేక్‌లను నమ్ముకుంటారు అంటూ విమర్శలు పాలైన ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ సినిమాలు తీస్తూ ఔరా అనిపిస్తుంది. కేజీఎఫ్‌, కాంతార, చార్లీ777, విక్రాంత్‌ రోణ ఇలా కంటెంట్‌ కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో మరో సినిమా కన్నడనాట సంచలన సృష్టిస్తుంది. అదే హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే. రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. 

క్రైమ్‌ కామెడీ

గత శుక్రవారం కన్నడలో రిలీజైన ఈ సినిమా ఇక్కడ బేబీ మాదిరిగానే కన్నడలో బీభత్సమైన వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌లో కనిపించిన రిషబ్‌ శెట్టి తప్పితే పేరున్న నటుడే లేడు. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ హాస్టల్‌ చుట్టూ తిరుగుతుంది. హాస్టల్‌ రూంలో ఉండే ఐదుగురు స్టూడెంట్‌ కుర్రాళ్ళలో ఒకరికి షార్ట్‌ ఫిలిం తీయాలని ఉంటుంది. కానీ ఎగ్జామ్స్‌ ఉండటంతో వాళ్ల ఫ్రెండ్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఆలోచనను కొన్ని రోజులు పక్కన పెట్టమంటారు. ఆ తర్వాత ఓ రోజును హఠాత్తుగా హాస్టల్‌లో వార్డెన్‌ శవం దొరుకుతుంది. తన చావుకు వీళ్ళే కారణమంటూ ఆ ఐదుగురు పేర్లు రాసిన సూసైడ్‌ నోట్‌ కనిపిస్తుంది. దీంతో ఆ గండం నుంచి బయటపడేందుకు అదే హాస్టల్‌లో ఉన్న సీనియర్‌ సహాయం కోరుతారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమా కథాంశం.

ఓ వైపు ట్విస్ట్‌లతో షాకిస్తూనే.. మరోవైపు ఆ ట్విస్ట్‌లలో జెనరేట్‌ అయ్యే కామెడీతో కడుపుబ్బా నవ్వుకుంటారు. మనకు ఈ నగరానికి ఏమైంది ఎలాగో.. కన్నడలో హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే. అయితే దీనికి క్రైమ్‌ కామెడీని ఎంటర్‌టైనమెంట్స్‌ డోస్‌ పెంచారు. తొలిరోజు కోటీ షేర్‌ కూడా రాని ఈ సినిమా మౌత్‌ టాక్‌ పాజిటీవ్‌ రావడంతో కలెక్షన్‌ల వరద పారుతుంది. ఐదో రోజు ఏకంగా కోటిన్నర షేర్‌ను సాధించి వీర లెవల్లో దూసుకుపోతుంది. రేపో మాపో ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేయడం మాత్రం ఖాయం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !