విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు Gmail ను తప్పకుండా వాడుతారు. మెసెజ్‌తో పాటు ఇంపార్టెంట్ ఫైల్స్‌ను పంపించుకోవడానికి Gmail ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా Gmail ద్వారా ఫైల్స్ పంపించుకోవచ్చు. అయితే చాలా మంది దీనిని మెయింటేన్ చేయడంలో ఇబ్బందులకు గురవుతుంటారు. కొందరి Gmail లోకి Spam ఫైల్స్ వచ్చి చేరుతూ ఉంటాయి. దీంతో స్టోరీజ్ మొత్తం నిండిపోతుంది. ఈ క్రమంలో ముఖ్యమైన ఫైల్స్ రావడానికి, వెళ్లడానికి ఇబ్బందిగా మారుతుంది. అయితే అవసరం లేని ఫైల్స్‌ను తీసేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ చిన్న ట్రిక్ ద్వారా ఈజీగా అవసరం లేని చెత్తను తీసేయొచ్చు. ఆ విధానం ఏంటో తెలుసుకుందాం. Gmail యూజ్ చేయని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో చేసే ప్రతీ పనికి Gmail అనుసంధానించటం అలవాటుగా మారింది. అధార్‌కార్డ్, పాన్‌కార్డు, ఓటర్ కార్డు లెక్క ఆన్‌లైన్లో ఎలాంటి వర్క్ చేయాలనుకున్నా జీమెయిల్‌ను అడుగుతారు. అయితే ఇందులో ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే ఉంచుకొని మిగతావి డెలీట్ చేస్తు ఉంటారు. కానీ రోజూ వందల కొద్దీ స్పామ్ ఫైల్స్ వస్తున్న క్రమంలో ఒక్కొక్కటి డెలీట్ చేయాలంటే ఇబ్బందిగా మారుతుంది. ఈ తరుణంలో ఓ చిన్న మార్గం ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. అదెలాగంటే?
చిన్న ట్రిక్స్...పెద్ద ఊరట !
ముందుగా.. మీ Gmail ఖాతాను ఓపెన్ చేయండి. ఇందులో సెర్చ్ బాక్స్‌లో Unsubscribe అని టైప్ చేయండి. పక్కనే ఉన్నFilter ఐకాన్‌ను టిక్ చేయండి. ఆ తరువాత Create Filter ను టిక్ చేయాలి. Applay Lable ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత Choose Lable లో Unsubscribe అని టైప్ చేయాలి. ఇందులో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో లాస్ట్ ఆప్షన్ Create Filter ను టిక్ చేయాలి. All Junk మెయిల్స్ డిస్ ప్లే అవుతాయి. ఇక నుంచి AllSpam ఫైల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఆ Lable లోకి వెళ్లి అన్నీ మెయిల్స్‌ను ఒకేసారి డెలీట్ చేయాలి. ఇలా ఎలాంటి కష్టం లేకుండా మీ Spam ఫైల్స్ ను తీసేసుకోండి. ఈరోజుల్లో సాధారణ పనులతోనే సమయం గడిచిపోతుంది. అలాంటిది ప్రత్యేకంగా మెయిల్స్ డెలీట్ చేసుకుంటూ కూర్చోలేం. అందువల్ల ఈ చిన్న ట్రిక్ ద్వారా మీ స్పామ్ మెయిల్స్ ను తీసేసుకోవడం ద్వారా ఇంపార్టెంట్ ఫైల్స్ ను మీమెయిల్ లో భద్రంగా ఉంచుకోవచ్చు. అలాగే స్టోరీజ్ నిండిపోకుండా ఉంటుంది. దీంతో కొత్త ఫైల్స్ రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఈ వీడియోను చూడండి.