Loan App Mafia : ఆగని లోన్‌ యాప్‌ ఆగడాలు !

0

లోన్‌ యాప్‌ నిర్వాహకుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మానసిక వ్యధకు గురిచేసి బెదిరింపులతో డబ్బు గుంజాలనే ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అదే కోవలో ఓ యువతి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి వేధింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా మార్ఫింగ్‌ చేసిన ఫోటోలను యువతి కాంటాక్ట్‌ నెంబర్లకు పంపించి మానసికంగా వేధించారు. దీంతో బాధిత యువతి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 

ఇంకా బకాయి ఉన్నారని బెదిరింపు కాల్స్‌

పోలీసుల వివరాల ప్రకారం... సంగం మండలంలో నివాసం ఉండే యువతి వారం రోజుల క్రితం అత్యవసరంగా 3వేల రూపాయలు అవసరమై లోన్‌ యాప్‌ లను గూగుల్‌లో సెర్చ్‌ చేసింది. క్యాండీ క్యాష్‌, ఈజీ మనీ యాప్‌లలో యువతి తన వివరాలను అప్లోడ్‌ చేసింది. రెండు యాప్‌ ల నుంచి రూ.3,700 యువతి అకౌంట్‌ లో క్రెడిట్‌ అయ్యాయి. 3 రోజుల తరువాత తీసుకున్న అమౌంట్‌ను యువతి తిరిగి చెల్లించింది. అయినప్పటికీ, ఇంకా బకాయి ఉన్నారని లోన్‌ యాప్‌ నిర్వాహకుల నుంచి యువతికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. నగదు కట్టకపోతే ఫోటోలను మార్ఫింగ్‌ చేసి పరువు తీస్తామని యువతిని భయపెట్టారు. శుక్రవారం యువతి ఫోన్‌ ను యాప్‌ నిర్వహకులు హ్యాక్‌ చేసి, మార్ఫింగ్‌ చేసిన యువతి ఫోటోలను కాంటాక్ట్‌ నెంబర్లకు పంపించారు. దిక్కుతోచని పరిస్థితుల్లో బాధిత యువతి రోధిస్తూ దిశ ూూూకు కాల్‌ చేసి సహాయం కోరింది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు లోన్‌ యాప్‌ నిర్వహకులపై కేసు నమోదు చేశారు. సైబర్‌ పోలీసులకు కూడా వివరాలను అందించారు. లోన్‌ యాప్‌ నుంచి ఎలాంటి కాల్స్‌ వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని యువతికి సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !