జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇతడు నారాయణ కాలేజ్‌కి చెందిన విద్యార్థి కావటం విశేషం. ఢల్లీికి చెందిన ఆదిత్య, పుణేకు చెందిన ధ్రువ్ షాలకు కూడా స్వర్ణ పతకాలు దక్కగా, చండీగఢ్‌కు చెందిన రాఘవ్ గోయల్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రిథమ్ కేదియా రజత పతకాలు సాధించారు. భారత్ నుంచి మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా, అందరూ పతకాలు నెగ్గడం విశేషం. ఈ సందర్భంగా మెహుల్ మాట్లాడుతూ నారాయణ ప్రోగ్రామ్ మరియు టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ ఘనవిజయం సాధ్యమైనట్లు తెలిపాడు. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన ఐఐటి ముంబాయిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించాడు మెహుల్. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నాడు. మెహుల్ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలించగా తల్లి బిజినెస్ నిర్వహిస్తుండగా, తండ్రి డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.
Narayana student bags gold Medal : ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి గోల్డ్‌మెడల్ !
జులై 19, 2023
0
Tags