No Confidence Motion : ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాసం ! అనుమతించిన స్పీకర్‌ !

0

 


మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు నోటీసు ఇచ్చాయి. మణిపూర్‌ అంశంపై కేంద్ర విధానాలు సరిగా లేవని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్‌ 198(బీ) ప్రకారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ జరిగే లోక్‌సభ బిజినెస్‌లో ఈ నోటీసును కూడా చేర్చాలని ఆయన సెక్రటరీ జనరల్‌ను కోరారు. కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గగోయల్‌ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్‌ మోషన్‌ ఫైల్‌ చేశారు. మణిపూర్‌ అంశంపై చర్చకు ప్రధాని మోదీ ముఖం చాటేయడం వల్ల .. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా సభ సజావుగా సాగడం లేదు. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం సరైందే అని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించిన స్పీకర్‌

 కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడిరచారు. ఉదయం లోక్‌సభలో కాంగ్రెస్‌, భారాస పార్టీలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్‌సభ మరోసారి వాయిదా పడిరది. మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ వెల్లడిరచాం



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !