ఆపరేషన్ 2024.. దిల్లీ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది.. అటు విపక్షాల సమావేశం.. ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశం.. దీంతో హస్తిన రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దిల్లీ వేదికగా ఎన్డీఏ కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీజేపీ సహా.. 35 పార్టీలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్డీఏని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి.. కీలక ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో జనసేనతో పాటు శిరోమణి అకాళీదళ్, లోక్ జనశక్తి లాంటి కీలక పార్టీలు హాజరయ్యాయి. అయితే, ఈ సమావేశానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏను లక్ష్యంగా చేసుకున్న ప్రధాని మోడీ.. అభివృద్ధిని విస్మరించారంటూ ఫైర్ అయ్యారు. సొంత లాభం కోసమే విపక్షాలు పని చేశాయంటూ మండిపడ్డారు. కొన్ని పార్టీలు ఏళ్లకు ఏళ్లు కుటుంబాల కోసమే పని చేస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. యూపీఏ హయాంలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాల నినాదం కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు మాత్రమేనంటూ పేర్కొన్నారు.
అభివృద్థి మారుమాల ప్రాంతాలకు విస్తరించాం !
మంగళవారం అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని (ఎన్‌ఐటీబీ) ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రెండిరతల నిధులను అండమాన్ అండ్ నికోబార్ దీవుల కోసం వెచ్చించిందని పేర్కొన్నారు. పచ్చి అవినీతిపరులు సదస్సు జరుగుతోంది’’ అని విరుచుకుపడ్డారు. గత 9 ఏళ్లలో పాత ప్రభుత్వాల తప్పులు సరిచేయడంతోపాటు.. ప్రజలకు కొత్త సౌకర్యాలు, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు భారత్‌లో కొత్తరకం అభివృద్ధి విధానం ఉంది. అదే సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లో పెరిగిన పర్యాటక రంగం మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించిందన్నారు. కానీ, గతంలో స్వార్థపూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులు మారుమూల ప్రాంతాలకు చేరడం సాధ్యం కాలేదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో ఈ ద్వీపాల్లో పర్యాటక రంగం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. తమిళనాడులో అవినీతి కేసులు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు డీఎంకేకు క్లీన్ చిట్ ఇచ్చాయని, బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస గురించి మాట్లాడడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. యూపీఏ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దామని.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు బెంగళూరులో నిన్న మొదలైన విపక్షాల భేటీ నేడు కూడా కొనసాగనుంది. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ సహా 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.