Poonam Kaurs Tweet On Ap Politics : నకిలీ లీడర్లు మహిళలపై ప్రేమ చూపిస్తున్నారు జాగ్రత్త...నటి పూనమ్‌కౌర్‌ ట్వీట్‌ !

0

నటీ పూనమ్‌ కౌర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో పాపులారిటీ మాత్రం విపరీతంగా సంపాదించుకుంది. నటిగా కంటే కూడా సోషల్‌ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్‌ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్‌కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్‌ ఏపీ పాలిటిక్స్‌పై ఇలా ట్వీట్‌ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు.

నకిలీ లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి

ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కొందరు ఫేక్‌ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢల్లీిలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు.ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్‌ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను అంటున్నావ్‌ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్‌ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్‌కు వార్నింగ్‌ ఇస్తూ పవన్‌ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్‌ ఇస్తున్నారు. ఆంధ్రాలో వారాహి యాత్రలో భాగంగా పవన్‌ హుమన్‌ ట్రాఫికింగ్‌ గురించి మాట్లాడిన నేపథ్యంలో అక్కడ తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాలో మరో ట్వీట్‌ చేశారు. ‘మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు ‘కౌర్‌’ అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.’ అని పోస్ట్‌ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !