Priya Ponguru Husband Mani Ponguru Reaction : మానసిక ఆందోళన కారణంగానే ఇలాంటి వ్యాఖ్యలు - మణి పొంగూరు

0
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడు భార్య ప్రియ పొంగూరు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె భర్త మణి పొంగూరు స్పందించారు. మానసిక అనారోగ్య కారణంగా తీవ్ర ఆందోళనకు లోనై మాట్లాడుతున్న మాటలుగా భావించాలని మణి  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు, మూడు రోజులుగా నా భార్య అయిన ప్రియ పొంగూరు తన ఇన్‌స్టాగ్రాం మరియు ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా పలు వీడియోలు పోస్ట్‌ చేస్తోంది. ఈ వీడియోలు నాకు, నా కుటుంబ పరువుకి భంగం కలిగించేలా మరియు అభ్యంతరకరంగా ఉన్నాయి. దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు.

అనారోగ్యం కారణంగా మానసికంగా కృంగిపోయింది !

ప్రియ పొంగూరు గత కొన్ని సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పొంగూరు మణి తెలిపారు. మొదటగా 2017లో తిరుపతిలో డా॥శేషమ్మ గారి దగ్గర చికిత్స తీసుకున్నట్లు వివరించారు. అనంతరం 2019 వ సంవత్సరంలో ప్రియ తల్లిదండ్రులతో కలిసి గుంటూరులోని ప్రముఖ సైకాలజీ నిపుణులు డాక్టర్‌ ఫణిభూషణ్‌ దగ్గర చికిత్స చేయించినా ఎలాంటి ఫలితం లేకపోయిదన్నారు. 2020 వ సంవత్సరంలో హైద్రాబాద్‌లోని మానస హాస్పిటల్‌లో డాక్టర్‌ విరించి శర్మ వద్ద పూర్తి పర్యవేక్షణలో చికిత్స అందించినట్లు చెప్పారు. ఆయినా కోలుకోకపోవటంతో హైద్రాబాద్‌ ఏఐజీ హాస్పిటల్‌ డాక్టర్‌ సబ్రీనా గారి దగ్గర చికిత్స కొనసాగించినట్లు పేర్కొన్నారు. చికిత్స సమయంలో డాక్టర్‌లు సూచించిన విషయం ఏమిటంటే...తనకు తానుగా ఏదైనా అఘాయిత్యం చేసుకునే అవకాశం ఉందని, సూసైడ్‌ చేసుకునే ఆలోచనలు ఉన్నాయని ఆమెను 24 గంటలూ పర్యవేక్షించవలసిన అవసరం ఉందని  సూచించినట్లు వివరించారు. ఈ క్రమంలోనే 3 నెలల క్రిందట దురదృష్టవశాత్తు ప్రియకు బెస్ట్‌ క్యాన్సర్‌ అటాక్‌ అయిందన్నారు. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఆపరేషన్‌ చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కీమో థెరపీ సెషన్స్‌ జరుగుతున్నాయన్నారు. ఈ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ మొదలైన తర్వాత మానసిక వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్‌ తగ్గించటం కారణంగా మళ్ళీ మానసిక సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ విధంగా వీడియోలు చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేస్తోన్నట్లు పేర్కొన్నారు. కాబట్టి అందరూ దయ ఉంచి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని ఈ వీడియోలను పట్టించుకోవద్దని పొంగూరు మణి మనవి చేశారు. 






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !