Revanth Reddy Comments On Free Current : బైబై కేసీఆర్‌ అంటూ ఉచిత కరెంట్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు

0

 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ రైతులకు ఉచిత విద్యుత్‌ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంపైనే గత కొన్ని రోజులుగా అధికార బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికాలోని తానా సభల్లో రేవంత్‌ రెడ్డి తెలంగాణలో వ్యవసాయానికి 24గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారని అది అవసరం లేదని మూడు గంటలు ఇస్తే చాలని చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ రేవంత్‌ రెడ్డి అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. 

రేవంత్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌

తాజాగా ఈ విషయంపై మరోసారి స్పందించారు టీపీసీసీ అధ్యక్షులు. ఈ మేరకు ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్‌ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది’ అని రేవంత్‌ రెడ్డి రాసుకొచ్చిరు. తద్వారా రైతులకు 24 గంటల కరెంట్‌ విద్యుత్‌పై జరుగుతోన్న ప్రచారాన్ని మరోసారి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు రేవంత్‌. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఈ అంశంపై స్పందించారు. ఉచిత కరెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని స్పష్టం చేశారు. ‘దేశంలో ఎక్కడ ఫ్రీ పవర్‌ ఇస్తున్నా అది కాంగ్రెస్‌ ఘనతే. బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ గాలి మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణకు కరెంట్‌ కష్టాలు రాకూడదనే విభజన టైమ్‌లో 53శాతం విద్యుత్‌ కేటాయించారు. ఇప్పుడున్న పవర్‌ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ కట్టినవే. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక చేసిందేమీ లేదు ‘ అంటూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది

తన వ్యాఖ్యలపై ఇప్పటికే స్పష్టత నిచ్చిన రేవంత్‌.. తాజాగా మరో ట్వీట్‌ చేశారు. ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్‌ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది’’ అని ఈ రోజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి తన పోస్ట్‌కు ‘బైబై కేసీఆర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !