ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ్‌లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. నాగ చైతన్యని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల క్రితం విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. తాను చేసే సినిమాలతో పాటు అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది.ఈ సమయంలో సమంత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. సినిమాలకు సుధీర్ఘ విరామం ఇవ్వాలని సమంత నిర్ణయిచుకున్నారట. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నారట. తన ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన సమంత ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.ఆరోగ్యం కోలుకున్నాక మళ్ళీ సమంత వరుసగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది. సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తుంది. అటు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో సిటాడెల్ వెబ్‌సిరీస్ చేస్తుంది. సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.
సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్
ఇటీవలే సిటాడెల్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసింది సమంత. తాజాగా ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. దీంతో ఒక సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని ప్రకటించింది సమంత. సమంత నిర్ణయంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. అలాగే తీసుకున్న సినిమాల అడ్వాన్స్ లు కూడా నిర్మాతలకి తిరిగి ఇస్తుండటంతో ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. సమంత మళ్ళీ సినిమాలు చేయదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల మళ్ళీ తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని, పూర్తిగా ఆరోగ్యంపై ఫోకస్ చేసేందుకే సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు సమంత తెలిపింది. ఇక కొత్త సినిమాలు కూడా ఏమి ఒప్పుకోదని సమాచారం. దీంతో సమంత నిర్ణయం అభిమానులను, ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటారో లేదో. ఇటీవల విడుదల అయిన ‘శాకుంతలం’ సినిమా సమంతకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిరది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై సమంత ఆచితూచి అడుగులు వేస్తుందనుకున్నారు అంతా. ఈ లోపే బ్రేక్ తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.