Teegala Krishna Reddy Join in Congress : తెలంగాణ కాంగ్రెస్‌లోకి భారీగా వలస వస్తున్న ముఖ్యనాయకులు !

0

 


తెలంగాణ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. వరుస చేరికలతో గాంధీభవన్‌ కళకళలాడుతోంది. ప్రధాన పార్టీల్లోని అసంతృప్త నేతలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. ఇవాళ, ఢల్లీి వేదికగా కీలక నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నారు. ఇంతకీ, కాంగ్రెస్‌లో చేరబోతున్న ఆ నేతలు ఎవరు ? అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలల టైమ్‌ కూడా లేకపోవడంతో ముందే జాయినై కర్ఫీప్‌ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బాటలోనే మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అవుతున్నారు. జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్‌ చేసుకోగా, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి చర్చలు జరిపారు. టీడీపీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన తీగల.. హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 2009లో మహేశ్వరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత, బీఆర్‌ఎస్‌లో చేరిన తీగల.. 2018లో మరోసారి సబిత చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక, తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి.. మహేశ్వరం జెడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అయ్యారు. అయితే, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అదే టైమ్‌లో తనకు ప్రాధాన్యత తగ్గుతోందని భావించిన తీగల.. కాంగ్రెస్‌లో చేరాలని డిసైడైనట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో చేరడానికి మరికొందరు రెడీ

తీగలతోపాటు మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు టాక్‌. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మందుల శ్యామల్‌, రామారావు పటేల్‌, కోదాడకు చెందిన శశిధర్‌రెడ్డి, ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత సునీల్‌రెడ్డి, వికారాబాద్‌ జిల్లా జెడ్పీపర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితా కాంగ్రెస్‌లో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఢల్లీి వేదికగా పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు . ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుబోతున్నారు.  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !