Telangana Schools Bandh : తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌, కారణం ఏమిటంటే

0

నేడు రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్‌) పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ జిల్లాలన్నింటిలో పాఠశాలలు,కళాశాలలు మూతపడ్డాయి. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల ఫీజులపై పరిమితి లేనందున ప్రభుత్వం ఫీజుల కట్టడిపై పరిమితి విధించాలని విద్యార్థులు పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నా.. ప్రభుత్వం వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లెప్ట్‌ వింగ్‌ స్టూడెంట్‌ యూనియన్స్‌ పేర్కొంటున్నాయి. విద్యా సమస్యలపై ఇటీవల భేటీ అయిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సైతం తూతూ మంత్రంగానే సాగింది తప్పా.. ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డాయి. ఫీజుల నియంత్రణకు కేబినెట్‌ సబ్‌ కమిటీ రిపోర్ట్‌, తిరుపతిరావు కమిటీ నివేదికలు బహిర్గతం చేయకపోవడం సర్కారు సైతం కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యారంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇది కాకుండా,ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీజుూ, ణూజ పోస్టులకు సుమారు 15,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ డిమాండ్‌ చేసింది.

సమస్యల వలయం 

దేశంలోనే తెలంగాణలోనే అత్యధికంగా విద్యా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీంతో తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇంత పెద్దఎత్తున ఫీజులు కట్టడం కష్టంగా మారిందని ఏబీవీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల చదువులు చెప్పే టీచర్లు లేక.. మరికొన్ని చోట్ల మౌలిక సదుపాయాలు లేవని పేర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేవని, మధ్యాహ్న భోజనం బిల్లుల పెండిరగ్‌ వంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే బంద్‌కు పిలుపునిచ్చినట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు AIూఖీ, ూఖీI, AIణూఖ, ూణూఖ తెలిపాయి. దీనికి తోడు పాఠ్యపుస్తకాల ధర ఎక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూల్స్‌ అవసరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసన నాయకులు విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి పాఠశాలలకు నిధులు కేటాయించాల్సిన తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని నేతలు కోరుతున్నారు.ఈ నేపథ్యంలో పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. అందుకే జూలై 12న పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. 

నెరవేరని బంద్‌ ప్రయోజనం !

విద్యార్థి సంఘాలు ఎన్ని సార్లు బంద్‌కి పిలుపునిచ్చిన ప్రభుత్వాల్లో ఏమాత్రం చలనం కనిపించటం లేదు. పిల్లలకు ఒక రోజు సెలవు తప్ప బంద్‌ ప్రయోజనం నెరవేరటం లేదు. ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపించటం లేదు. ప్రైవేట్‌ స్కూల్స్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ స్కూల్స్‌ను పట్టించుకోవటం లేదు. కనీసం ప్రైవేట్‌ స్కూల్స్‌ దోపిడీకి సైతం పగ్గాలు వేయటం లేదు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూల్స్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరించటం వ్యవస్థ తీరుకు అద్ధం పడుతోంది. ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !