TS Congress CM Candidate Sitakka : కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి సీతక్క...తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహత్మక నిర్ణయం !

0

కాంగ్రెస్‌ అంటేనే సహాజంగానే కలహాలు, కుమ్ములాటలు.. అదొక మహాసముద్రం.. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి అభ్యర్థి సిఎం అభ్యర్థే అంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఉద్దండులు ఉన్న పార్టీ తెలంగాణ కాంగ్రెస్‌. అందరికీ విచ్చలవిడిగా స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఏమైనా మాట్లాడొచ్చు. కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీ కోసం పనిచేయవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారైతే బీజేపీలో ఉన్న తన తమ్ముడి గెలుపుకోసం ప్రయత్నించారు. అయితే కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్‌కు జోష్‌ వచ్చింది. తెలంగాణపై ఆశలు పుట్టాయి. అయితే పార్టీలో మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్‌లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నుంచి అందరూ సీఎం సీటు కోసం పోటీపడుతున్నారు. సీఎం అభ్యర్థిపై ఎవరికి వారు సొంతంగా తామంటే తాము అని ప్రచారం చేసుకున్నారు. అయితే రేవంత్‌ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు. తనను తాను పోటీదారుడిగా ప్రకటించుకోకుండా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహిళకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం విశేషం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్‌ పార్టీపైనే పడిరది.

సీతక్క పేరు బయటకు రావటంతో...

ఈసారి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం అభ్యర్థిగా సీతక్క పేరు ప్రకటించింది. అనుకోకుండానో, సందర్భోచితంగానో సిఎం అభ్యర్థిగా ములుగు సీతక్క పేరు రేవంత్‌ రెడ్డి నోటి నుండి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌కు ఈ పరిణామం పెద్ద షాక్‌ అని చెప్పవచ్చు. దళిత ముఖ్యమంత్రి అని తూచ్‌ అని చెప్పిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంది. ఎందుకంటే సీఎం పదవిని కేసీఆర్‌ లేకపోతే కేటీఆర్‌ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు సీతక్క పేరు చెప్పడంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా మహిళల పేర్లు ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అవి ఆ సాహసం చేయవు. దీంతో ఇరకాటంలో పడినట్లు అవుతుంది.

తానా సభల్లో ..

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీతక్క ఇద్దరు తానా సభలకు హాజరయ్యారు. అక్కడ ఓ ఎన్‌ఆర్‌ఐ రేవంత్‌ రెడ్డికి ప్రశ్నించారు. ఎస్టీ అయిన సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా ? మీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా... ఉప ముఖ్యమంత్రి కాదు సందర్భం వస్తే ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి అయినా కావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో ఎవరైనా సిఎం కావచ్చు అనే రీతిలో మాట్లాడబోయిన రేవంత్‌ రెడ్డి, సీతక్క పేరు రావటంతో తెలంగాణ కాంగ్రెస్‌ సిఎం అభ్యర్థి సీతక్క పేరు మార్మొగుతోంది. కరోనా సమయంలో సీతక్క చేసిన సాయం ఎవరూ మరువలేరు. ఆమె సిఎం కావాలని యావత్‌ తెలంగాణ కోరుకుంటోంది కూడా. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో ఆయనతో పాటు పాల్గొని ఆయన వెన్నంటే నడిచింది. రాహుల్‌ గాంధీకి ఆమె అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్‌ సీతక్కను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, ఒక ఎస్టీ గిరిజన మహిళకు అవకాశం ఇవ్వటంతో కాంగ్రెస్‌ ఇమేజ్‌ మరింతగా పెరుగుతుంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చే అవకాశం మెండుగా ఉంది. దీంతో మిగతా పార్టీలను చిక్కుల్లో పెట్టారు. వారిని కోలుకోలేని దెబ్బతీశారు. ఇప్పుడు సీఎం అభ్యర్థి మీదే రాజకీయం తిరుగుతుంది.

కాంగ్రెస్‌ అధిష్టానం ఒప్పుకుంటుందా ?

సీఎం అభ్యర్థి విషయంలో రేవంత్‌ రెడ్డి సొంత నిర్ణయమా? పార్టీ ప్రకటన అనేది తెలియడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఒకరి మాట చెల్లదు. దానికి అందరి సమ్మతం కావాలి. అధిష్టానం ఒప్పుకోవాలి. అప్పుడే నిర్ణయం జరుగుతుంది. అందుకే రేవంత్‌ రెడ్డి ప్రకటన ఆచరణకు నోచుకుంటుందా? లేక మధ్యలోనే మాసిపోతుందా అనేది తేలాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !