V Hanumantha Rao Interesting Comments : రాహుల్‌ గాంధీ పప్పు కాదు, అందరికీ పప్పాల తయారయ్యారు !

0


పప్పు అంటూ ఎవరినైతే అవహేళన చేశారో, ఇప్పుడదే రాహుల్‌ గాంధీ అందరికీ పప్పా అయ్యాడంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశంలో రాహుల్‌గాంధీ గ్రాఫ్‌ పెరిగిందని చెప్పారు. సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ ూదీజ నాయకుల సమావేశంలో వీహెచ్‌ మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ గట్టిగా కష్టపడితే కాంగ్రెస్‌ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో చిన్న చిన్న కోపాలు, గొడవలు ఉన్నాయన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలున్నాయని పేర్కొన్నారు. సీనియర్‌పై జూనియర్‌ పెత్తనం చెలాయిస్తానంటే ఊరికే ఉంటారా? తమ పార్టీలోని లొల్లి కూడా అలాంటిదేనని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ నేతలను కేసీఆర్‌ బంగాళాఖాతంలో కలిపేస్తానని అంటున్నారని.. జనం నిన్నే బంగాళాఖాతంలో వేస్తారని వీహెచ్‌ పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర ‘అల్లాకే బాబా దేదో’ అంటూ అడుక్కునేవాడివి అని ఎద్దేవా చేశారు. అన్నం పెట్టినోనికి కేసీఆర్‌ సున్నం పెడతాడని విమర్శించారు. 

రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారు !

ఈసారి రాహుల్‌ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతాడని, లేకపోతే తన పేరు హనుమంతరావు కాదని ఛాలెంజ్‌ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ.. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తే.. రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. నేతలు కాంగ్రెస్‌లో ఉంటే అవినీతిపరులు, బీజేపీలో చేరితే సత్యహరిశ్చంద్రులా? అని నిలదీశారు. త్వరలోనే బీసీ గర్జన పెడతామని.. ఇందుకు థాక్రే, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ఒప్పుకున్నారని తెలిపారు. కేవలం అగ్ర కులాలకే కాదు, రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్‌ ఉంటుందని వీహెచ్‌ చెప్పారు. అగ్రకులాల వాళ్ళు ూదీజ లను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. రాహుల్‌ తన జోడో యాత్రలో భాగంగా అన్ని వర్గాల వారిని కలిశారన్నారు. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ అంటున్నారని.. మొదట 20 శాతం తెచ్చుకొని, ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం హితవు పలికారు. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. తానెవ్వరికీ వ్యతిరేకం కాదని, తమ హక్కుల కోసం తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఫైనల్‌గా తాను సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ మాట మాత్రమే వింటానన్నారు. ఆప్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని చెప్పే కేసీఆర్‌, అదే రైతుల్ని జైల్లో వేయిస్తున్నాడని ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !