Where Is Y. S. Sharmila : వై.ఎస్‌.షర్మిల ఎక్కడ ? ఆ పార్టీలో ఏం జరుగుతోంది ?

0

 

వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి వారసురాలిగా తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకుంది. పాదయాత్ర చేసింది. కేసీఆర్‌ కుటుంబం మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసింది. నాలుగైదు సార్లు అరెస్టు అయింది.. అంతేకాదు పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది.  నిత్యం ప్రెస్‌మీట్లతో వార్తల్లో నిలిచింది. రాజన్న రాజ్యం తెలంగాణలో తీసుకొస్తానని ప్రకటించింది. ఎన్నికలకు ముందుగానే మేనిఫెస్టో ప్రకటించి ఆసక్తి రేకెత్తించింది. ఏకంగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గాని ఆ ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. తెలంగాణలో ఎలాంటి చప్పుడు లేకుండా షర్మిల చటుక్కున మాయం అయ్యింది.

కాంగ్రెస్‌లో విలీనం దిశగా !

కర్ణాటక ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన తర్వాత షర్మిల పార్టీలో ఉత్సాహం దాదాపుగా తగ్గిపోయింది. అప్పట్లో అడపా దడపా ప్రెస్‌ మీట్‌లు పెట్టే షర్మిల ఇప్పుడు ఆ ఊసు కూడా మర్చిపోయారు. కేవలం ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ మరణంలో కనిపించని కోణం ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత యాక్టివ్‌ రాజకీయాల గురించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీకే శివకుమార్‌ షర్మిలను ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అన్న సిఎంగా ఉన్న రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టడానికి షర్మిల సుముఖంగా లేరని తెలుస్తోంది. తెలంగాణలో తన సత్తాచాటాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరోవైపు షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి అవసరం లేదని ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏపీ కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం ఉంటుందన్న వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె తెలంగాణలో మాత్రమే పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది..

పాడేరు నుండి పోటీ చేస్తారా ?

ఖమ్మంలో పాదయాత్ర నిర్వహించినప్పుడు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. వైయస్‌ విజయలక్ష్మిని ఆహ్వానించి పాలేరులో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఇక్కడినుంచి పోటీ చేస్తానని పద సందర్భాల్లో ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకో ఈ నియోజకవర్గానికి రావడం కూడా మానేశారు. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో షర్మిల పార్టీకి ఒక అధ్యక్షుడు ఉండేవారు. అయితే ఆమె తీరుతో విసిగి వేసారి పోయానని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. అయితే ఇటీవల వైయస్‌ జయంతి నిర్వహించిన సందర్భంగా షర్మిల కనీసం ఒక 200 మందిని కూడా సమీకరించలేకపోయారు. పైగా ఆమె పార్టీలో చేరిన ఇందిరా శోభన్‌ కూడా రాజీనామా చేశారు. ఈ ప్రకారం చూసుకున్నప్పటికీ ఆమె పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి నేత కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు గట్టి నాయకుడు కూడా లేరు. అయితే పార్టీని స్థాపించి భారీగా ప్రచారం చేసుకున్న షర్మిల తర్వాత ఎందుకనో వెనక్కి తగ్గిపోయినట్టు కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అని రాజకీయ పార్టీలు యాక్టివ్‌గా మారాయి. కానీ షర్మిల పార్టీ మాత్రం సైలెంట్‌ అయిపోయింది. తను ఎటు వెళ్ళాలో తేల్చుకోలేక ఇబ్బంది పడుతోంది. కేవలం ట్విట్టర్‌కు మాత్రమే పరిమితం అయిపోయింది. మరి భవిష్యత్తు రోజుల్లో షర్మిల తెలంగాణ నుంచి పోటీ చేస్తారా? లేక డీకే శివకుమార్‌ చూపించినట్టు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసి అక్కడి బాధ్యతలు స్వీకరిస్తారా? అని తేలాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !