ఈ ఒక్క ఫోటో భవిష్యత్తులో ఏం జరగబోతోందో మొత్తం ఓ క్లారిటీ వచ్చేస్తోంది. ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కునే చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా విడుదల వచ్చిన అపూర్వ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి,టీడీపీ,జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటించకపోయినా..ఇదే కన్ఫామ్ అని అర్ధం అవుతుంది. ఈ మూడు పార్టీల టార్గెట్ జగన్‌ను గద్దె దించడమే. ఇప్పటికే మూడు పార్టీలు మూడు కోణాల్లో జగన్‌పై యుద్ధం మొదలుపెట్టాయి. మరోపక్క ఢల్లీిలోను ఇదే చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ అప్పులు , ఓటర్ల తొలగింపు, ఇసుక మాఫియా మొదలగు అన్ని అంశాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి ఈ విషయం బయటపడిరదని అంత మాట్లాడుకుంటున్నారు. నేడు రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు ముచ్చటించడం ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిందని అంత అనుకుంటున్నారు.
పొత్తులతోనే ఎన్నికలకు !
పనిలో పనిగా ముందస్తు ఎన్నికల సమాచారాన్ని చంద్రబాబు సేకరించారు. ఆయన ఢల్లీి నుంచి వచ్చిన తరువాత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆ సందర్భంగా పొత్తులపై దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా టీడీపీ వెళ్లనుందని తెలుస్తోంది. పొత్తులు కొత్తేమీ కాదంటూ చంద్రబాబు చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు రాబోవు ఎన్నికల్లో పొత్తును ఖరారు చేస్తున్నాయి. అయితే, ఎవరితో పొత్తు? అనేది మాత్రం దాచేస్తున్నారు. ఎన్నికల నాటికి చూస్తారుగా? అంటూ దాటేశారు. రాష్ట్రం పునర్నిర్మాణం కోసం చంద్రబాబు పావులు కదిపారు. ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ తిరిగి అదే కూటమిలోకి వెళ్లనుంది. ఎన్నికలకు ముందుగానే ఎన్డీయేలో చేరడానికి రంగం సిద్ధమయింది. ప్రత్యేక ప్యాకేజిని చట్టబద్ధత చేయమని డిమాండ్ చేసిన చంద్రబాబు ఆనాడు ఎన్డీయేను కాదనుకుని బయటకు వచ్చిన విషయం విదితమే. అయితే, ఇప్పుడు బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ వచ్చిందో తెలియదుగానీ ఎన్డీయేకి దగ్గరవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తేల్చేశారు. లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే ఛాన్స్ ఉందని చంద్రబాబు క్లూ ఇచ్చేశారు. ఢల్లీిలో బీజేపీ పెద్దలతో ఆయన సోమవారం మాట్లాడారు. జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో ప్రత్యేకంగా మాట్లాడుతోన్న ఫోటో సోమవారం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఆ ఫోటోలో చంద్రబాబు, దగ్గుబాటి దంపతులు, వైసీపీ రెబల్ రఘురామక్రిష్ణంరాజు, మాజీ ఎంపీ రమేష్ ఉన్నారు. టీడీపీతో ప్యాచప్ కోసం వీళ్ళందరూ తమ వంతు కృషి చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ 2009 ఎన్నికల సందర్భంగా ఏర్పడిన మహాకూటమి వెనుక రమేష్ కసరత్తు చేశారు. మహాకూటమిని ఏర్పాటు చేయడానికి రమేష్ చేసిన ప్రయత్నం ఆ ఎన్నికల్లో ఫలించింది. కానీ, ఎన్నికల్లో మహా కూటమి ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే.
లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే ఛాన్స్
ప్రస్తుతం బీజేపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్దమైయింది. ఇదే విషయం చాలా కాలంగా రమేష్ చెబుతూ వస్తున్నారు. ఆయనతో పాటు రఘురామకృష్ణం రాజు కూడా పలు సందర్భాల్లో పొత్తు గురించి చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుందని చంద్రబాబు తాజా వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. దక్షిణ భారత దేశంలో బలహీనపడిన బీజేపీకి చంద్రబాబు ఒక దిక్కుగా కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ బోల్తాపడిన బీజేపీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు అండను కావాలనుకుంటోంది. ఆ దిశగా ముందుకొచ్చిన చంద్రబాబును వాడేసుకునేందుకు సిద్ధమయింది. కానీ, ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబును ఎన్డీయేలో భాగస్వామిగా చేసుకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీకి కొంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కోణం నుంచి బీజేపీ ఢల్లీి పెద్దలు చంద్రబాబు ప్రతిపాదనకు ఓకే చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడిరచడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. ఏపీ 20 ఏళ్లు వెనక్కు వెళ్లడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆలోచిత నిర్ణయాలే అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణతో పోటీపడేందుకు ఒక బ్లు ప్రింట్‌ను తయారు చేస్తున్నానని వెల్లడిరచారు. అందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. అంటే, రాబోవు ఎన్నికల్లో తెలంగాణ మోడల్ ను చూపడం ద్వారా ఏపీ ప్రజల్ని ఆకర్షించే అస్త్రాన్ని ఆయన తయారు చేస్తున్నారు. ఒక వైపు ఎన్నికలకు రెడీ అవుతూనే మరో వైపు పొత్తులను ఒక కొలిక్కి తీసుకొచ్చారు.
చంద్రబాబుకు మమత వ్యాఖ్యల జోష్
గత ఏడాది కాలంగా పొత్తు గురించి పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. ఇప్పటికి ఒక కొలిక్కి వచ్చినట్టు అయింది. ఢల్లీి వెళ్లొచ్చిన తరువాత చంద్రబాబు ఇచ్చిన సంకేతాల ప్రకారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏపీలో ఏర్పడబోతుంది. కానీ, తెలంగాణకు మాత్రం ఆ పొత్తు వర్తించేలా కనిపించడంలేదు. కేవలం ఏపీ వరకు మాత్రం పరిమితం అయ్యేలా చంద్రబాబు చెబుతున్నారు. ఢల్లీి వెళ్లొచ్చిన తరువాత హుషారుగా కనిపిస్తోన్న చంద్రబాబు ముందస్తు ఎన్నికలు ఉంటాయని వెల్లడిరచారు. బెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఆయన ఇచ్చిన ముందస్తు సంకేతాలు ఉన్నాయి. అంతేకాదు, తొలి విడత 160 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు ఢల్లీి రాజకీయాల్లోని టాక్. ఏపీ, తెలంగాణ అభ్యర్థులను కూడా ముందుగానే విడుదల చేయాలని ప్లాన్ చేస్తుందట. ఇవన్నీ గమనిస్తే, మినీ జమిలీతో కూడిన ముందస్తు తథ్యంగా కనిపిస్తోంది.