TS Govt Crop Loan Waiver : ఇది రైతు ప్రభుత్వం...రుణమాఫీనే నిదర్శనం !

0

బీఆర్‌ఎస్‌ అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జై కిసాన్‌ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా, బీజేపీ  సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా, రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనమని వెల్లడిరచారు.

రైతు సంక్షేమంలో తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం.. కానీ, ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని పేర్కొన్నారు. యావత్‌ తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో చేస్తున్న నినాదమిదని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు. 

క్షేత్రస్థాయిలో వ్యతిరేకత..

రుణమాఫీపై క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. రుణమాఫీ హామీ ఇచ్చి నాలుగేళ్లు దాటింది. 2018 డిసెంబర్‌ వరకు తీసుకున్న రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ఐదేళ్లు గడిచాయి. ఇప్పటి వరకు కేవలం రూ.38 వేల వరకు రుణం మాఫీ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా రుణాల మాఫీకి రూ.19 వేల కోట్లు కావాలని తెలిపింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.లక్ష రుణం తీసుకున్న రైతు ఐదేళ్లుగా వడ్డీ కడుతూ వస్తున్నాడు. నెలకు రూ.1.50 వడ్డీ చొప్పున లెక్క కట్టినా.. 60 నెలల్లో లక్షరూపాయల రుణానికి రైతులు ఇప్పటి వరకు రూ.90 వేలు వడ్డీ కట్టారు. ఈ నష్టాన్ని రైతే భరించారు. ఇన్నేళ్లకు సీఎం రుణమాఫీ అంటూ ప్రకటించడం, సంబరాలు చేయాలని కేటీఆర్‌ పిలుపునివ్వడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆలస్యానికి కేంద్రమే కారణమట..

రుణమాఫీ ఇంత కాలం ఎందుకు ఆలస్యం అయిందంటే.. బీజేపీ వల్లేనంటున్నారు కేసీఆర్‌. కేంద్రం తీరువల్లే రుణమాఫీ ఆలస్యం అయిందని ఆరోపించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోతపెట్టింది. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరిగిందన్నారు. హామీ కేసీఆర్‌ ఇచ్చి.. నెపం కేంద్రంపై వేయడమే ఆశ్చర్యంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈఏడాది బడ్జెట్‌లో కేవలం రూ.6 వేల కోట్లు కేటాయించారు. రుణమాఫీ కావాలంటే.. మరో రూ.13 వేల కోట్లు సమీకరించాల్సి ఉంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !