సుప్రీంకోర్టులో స్టే
దీంతో కృష్ణమోహన్ రెడ్డి కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టులో స్టే లభిస్తే.. పదవి కాలం ముగిసిపోయే వరకు ఈ కేసు తేలే అవకాశం ఉండదు. మొత్తంగా.. 2018 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశకు రావడంతో..ఊహించని తీర్పులు వస్తున్నాయి.తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన కృష్ణమోహన్ రెడ్డి.. 2009లో టీడీపీ తరఫున గద్వాల్ నియోజవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి.. 2014లో ఆ పార్టీ తరఫున బరిలో దిగి ఓడిపోయారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై దాదాపు 30 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుతం గద్వాల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇక డీకే అరుణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
తప్పుడు అఫిడవిట్‌లతో నాయకులు ఎన్నికల్లో పాల్గొనటంతో పాటు గెలిచి రాజ్యాధికారాన్ని దక్కించుకుని చక్కగా పదవీకాలాన్ని అనుభవిస్తున్నారు. ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నారు. పదవీకాలం పూర్తయిపోతున్న సందర్భంలో హైకోర్టు తీర్పులో అఫిడవిట్‌లో తప్పుల కారణంగా ఎన్నికల చెల్లదని రావటంతో అసలైన నాయకులకు అన్యాయం జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సరైన చర్యలు తీసుకోవల్సి ఉంది. అఫిడవిట్‌లో తప్పులు సమర్పించిన వారికి జీవితకాలం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం అమలు చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.