Ileana D'Cruz : బిడ్డకు జన్మనిచ్చిన గోవా బ్యూటీ ఇలియానా !

0

గోవా బ్యూటీ ఇలియానా తల్లి అయ్యింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు చిన్నారి ఫొటోను షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్‌ డోలన్‌’ని పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలే, గొప్ప అనుభూతి ఇది’’  అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఇలియానాకు అభినందనలు చెబుతున్నారు.

తాను తల్లి కానున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇలియానా ప్రకటించింది. గత నెల జులైలో ప్రియుడి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అయితే ఇలియానా అతడి పేరును మాత్రం చెప్పకపోవడం గమనార్హం. తన ప్రియుడిని ఎవరో రెండు వారాల క్రితం పరిచయం చేసింది. అయితే అతని పేరు మాత్రం చెప్పలేదు. అయితే గర్భవతి అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన అప్‌డేట్‌ ఇస్తుంది ఇలియానా. బేబీబంప్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘తన కడుపులో ఓ జీవం పెరుగుతుందనే విషయం ఎంతో గొప్పగా ఉందనీ, మాతృత్వాన్ని ఆస్వాదించాలనే కోరిక రోజురోజుకి పెరుగుతుందని’ ఇలియానా చెప్పిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్లతోపాటు సినీ తారలు నర్గీస్‌ ఫక్రీ, హూమా ఖురేషి, అర్జున్‌ కపూర్‌, సోఫి చౌదరి తదితరులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ‘దేవదాస్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉంటోంది. ఈ అమ్మడు తెలుగు తెరపై చివరిసారి 2018లో కనిపించింది. రవితేజ హీరోగా నటించిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ లో అలరించింది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !