New Coach for SRH : కోచ్‌ మార్పుతోనైనా సన్‌రైజింగ్‌ వస్తుందా !

0

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌లో పేలవమైన ఆటతీరుతో ఫ్యాన్స్‌ని నిరాశ పరచటంలో అన్ని టీమ్‌లకన్నా ముందుంది. ఎప్పుడో 2016లో కప్‌ గెలిచాక.. మళ్ళీ సన్‌రైజర్స్‌లో ఆ స్థాయిలో మెరిసింది లేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇటీవలి కాలంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం కాకుండా.. అట్టడుగు ప్లేస్‌ కోసం ఆరెంజ్‌ ఆర్మీ పోటీ పడుతోంది. దీంతో అభిమానులు కూడా టీమ్‌ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టు ఆట సంగతి పక్కన పెడితే.. స్టాఫ్‌ తీసుకునే నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ గందరగోళంగా ఉంటాయి. బాగా ఆడే వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌ వంటి ప్లేయర్స్‌ని వదులుకున్నారు. అసలు చెత్తగా ఆడే ఆటగాళ్లను మాత్రం జట్టులో అంటి పెట్టుకుని ఉన్నారు. ఇక మ్యాచ్‌లు జరిగే సమయంలో వీరి వ్యూహాలు అత్యంత దారుణంగా, చెత్తగా కూడా ఉంటాయి. ప్రత్యర్థి గెలుపు కోసం వీళ్ళు కష్టపడుతున్నారా అన్నంతగా ఈ టీమ్‌ ప్రదర్శన ఉంటుంది. దీంతో.. ఈ టీమ్‌ ఓనర్‌ కావ్య మారన్‌ కు తిప్పలు తప్పడం లేదు. 

రజినీకాంత్‌ స్పందన - సీరియస్‌గా తీసుకున్న కావ్యపాప !

ఈ అంశంపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సైతం స్పందించడం గమనార్హం. ఓ సినిమా ఫంక్షన్‌లో రజినీ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ సందర్భంలో కావ్య బాధపడే సీన్‌ టీవీల్లో చూడలేకపోతున్నానని.. ప్రతిసారి ఛానల్‌ మార్చేయాల్సి వస్తోందని.. ఈ సారైనా మంచి ప్లేయర్లను ఎంపిక చేసుకోవాలని రజనీ సుచించారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. సుపర్‌ స్టార్‌ వ్యాఖ్యలను కావ్య సీరియస్‌గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కావ్య పాప టీమ్‌లో మార్పులు మొదలు పెట్టింది. సన్‌ రైజర్స్‌ కు కొత్త కోచ్‌ ని అనౌన్స్‌ చేసింది. క్రికెట్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా ఎస్‌.ఆర్‌.హెచ్‌ జట్టుకి కోచ్‌ గా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త కోచ్‌ అనగానే ముందుగా సెహ్వాగ్‌ పేరు తెరపైకి వచ్చింది. కానీ.., అందరినీ ఆశ్చరపరుస్తూ న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ డానియల్‌ విటోరి రంగంలోకి వచ్చాడు. విటోరిని సన్‌ రైజర్స్‌ కొత్త కోచ్‌ గా నియమించింది కావ్య మారన్‌. కెరీర్‌ లో 113 టెస్ట్‌ లు ఆడిన విటోరి 4531 రన్స్‌ చేసి, 362 వికెట్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 295 వన్డేల్లో 2253 పరుగులు చేసి.., ఏకంగా 305 వికెట్స్‌ సాధించడం విశేషం. ఇక ఇవన్నీ కాకుండా అప్పట్లో విటోరికి జెంటిల్మెన్‌ అన్న గుర్తింపు ఉండేది. కివీస్‌ జట్టులో ఇంతటి పోరాట పటిమ నింపిన కెప్టెన్స్‌ లో విటోరి కూడా ఒకరు. ఇలా ఆటలోని అన్ని విభాగాల్లో అనుభవం ఉన్న విటోరిని కోచ్‌ గా నియమించడంతో.. ఎస్‌.ఆర్‌.హెచ్‌ ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !