L&T Sold 15 acres Land in Raidurg :15 ఎకరాల మెట్రోభూమిని అమ్మిన ఎల్‌అండ్‌టీ ! నిబంధనల ఉల్లంఘన జరుగుతోందా ?

0

రాయదుర్గం వద్ద ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిలో 15 ఎకరాలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అమ్మేసింది. రాఫర్టీ డెలవప్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఈ భూమిని విక్రయించింది. హైదరాబాద్‌లో ఎకరా వంద కోట్లు పలుకుతున్న ప్రస్తుత తరుణంలో రాయదుర్గం లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 15 ఎకరాలు అమ్మితే ఎల్‌అండ్‌టీకి ఎంత సొమ్ము వచ్చి ఉంటుందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. భవిష్యత్తు అవసరాల కోసం రాయదుర్గం మెట్రో స్టేషన్‌ సమీపంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని కేటాయించింది. 

భవిష్యత్‌ అవసరాల కోసం కేటాయించిన భూమి

మెట్రోరైల్‌ లీగల్‌హెడ్‌, కంపెనీ కార్యదర్శి చంద్రచూడ్‌  డి.పాలివాల్‌ బుధవారం బీఎస్‌ఈ(స్టాక్‌ ఎక్ఛ్సేంజీ)కి అధికారికంగా తెలిపారు. ఆగస్టు 16న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్‌ఈకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈ విక్రయాన్ని ‘స్లంప్‌ సేల్‌’గా ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు అభివర్ణించారు. ఈ భూమి విలువ రూ.1,500 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రాయదుర్గం మెట్రోస్టేషన్‌ సమీపంలో 15 ఎకరాలను భవిష్యత్‌ అవసరాల కోసం  రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిలో 9 ఎకరాల్లో రూ.200కోట్లు వెచ్చించి ఎల్‌అండ్‌టీ అధికారులు ఒక భవనాన్ని నిర్మించారు. మెట్రో రైల్‌ నిర్వహణ, బ్రేక్‌ ఈవెన్‌ వంటి కారణాల నేపథ్యంలో ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు 15 ఎకరాల భూమి, భవనాన్ని విక్రయించేందుకు గతేడాదే ఎల్‌అండ్‌టీ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇందుకోసం రహేజా, బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థలతో ఎల్‌అండ్‌టీ అధికారులు చర్చించారు. చర్చల ఫలితంగానే బుధవారం రూ.1,500కోట్ల విలువైన భూమి, భవనాన్ని రాఫర్టీ సంస్థకు విక్రయించారు. రాఫర్టీ సంస్థలో రహేజా, బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎల్‌అండ్‌టీ సంస్థ 33 ఏళ్ల వరకూ స్థలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు తప్ప విక్రయించకూడదు. మరి 33 ఏళ్ల తర్వాత ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందా? రాఫర్టీ సంస్థకు చెందుతుందా? అన్న అంశంపై స్పష్టత లేదు. 

269 ఎకరాల కేటాయింపు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఎల్‌ అండ్‌ టీకి హైదరాబాద్‌ నగరంలో మొత్తం 269 ఎకరాలు కేటాయించింది. ఇందులో మెట్రో డిపోలున్న నాగోల్‌ దగ్గర 104 ఎకరాలు, మియాపూర్‌ దగ్గర 96 ఎకరాలు కేటాయించింది. ఇవికాక మరో 69 ఎకరాల భూమి ఇచ్చింది. అందులో భాగంగానే రాయదుర్గంలో ఇచ్చిన 15 ఎకరాలను తాజాగా ఎల్‌ అండ్‌ టీ అమ్మింది. ఈ లెక్కన చూస్తే ఆ పైన ఇంకో 54 ఎకరాలున్నాయి. అవికాక మెట్రో డిపోల దగ్గర కూడా చాలా భూమి ఉంది. అంతా కలిపి 100 ఎకరాల పైనే ఉంటుందని అంచనా. ఈ లెక్కన ఎల్‌ అండ్‌ టీ పంట పండినట్లే కనిపిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !